ఎరుపు రంగు క్యాప్సికంతో.. అమోఘమైన లాభాలు..!

హెల్త్

సాధారణంగా మనలో అధిక శాతం మంది ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికంనే ఎక్కువగా వంటల్లో వాడుతుంటారు. కానీ క్యాప్సికంలో నిజానికి ఇతర రంగులు ఉన్నవి కూడా ఉన్నాయి. వాటిల్లో ఎరుపు రంగు క్యాప్సికం కూడా ఒకటి. ఈ రకానికి చెందిన క్యాప్సికం ఆకుపచ్చ క్యాప్సికంలా కాదు. ఎన్నో పోషకాలు ఎరుపు రంగు క్యాప్సికంలో ఉంటాయి. మరి ఎరుపు రంగు క్యాప్సికంను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యల నుంచి బయట పడేస్తాయి. కంటి చూపు పెరుగుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

2. ఎరుపు రంగు క్యాప్సికంలో ఫైటో కెమికల్స్, కెరోనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి.

3. ఎరుపు రంగు క్యాప్సికంలో ఉండే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.

4. ఈ క్యాప్సికంలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్‌లు రాకుండా చూస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.

5. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మ సమస్యలను పోగొడుతుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. విటమిన్ బి6 కూడా ఈ క్యాప్సికంలో పుష్కలంగానే ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలానికి మరమ్మత్తులు చేస్తుంది. కొత్త కణజాలం తయారయ్యేలా చేస్తుంది.

6. ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తినడం వల్ల వాటిల్లో ఉండే లుటిన్ అనే ఎంజైమ్ కండ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి సమస్యలను రాకుండా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *