ఆరోగ్యాన్నిచ్చే డ్రైఫ్రూట్స్‌

హెల్త్

– బాదంలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల హైపర్‌ టెన్షన్‌కు గురయ్యేవారు తరచూ వీటిని తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు.
– నిజానికి ఉద్యోగం చేసే మహిళలు ప్రతిరోజూ ఉదయం బాదం తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే జీడిపప్పు, డ్రైడ్‌ ఆఫ్రికాట్‌లో కాపర్‌ పుష్కలంగా ఉంటుంది. బాదం శరీరంలో ఐరన్‌ను నిల్వ చేయడానికి సహాయపడుతుంది.
– శరీరంలోని కండరాలు ఉత్సాహంగా పనిచేయడానికి బాదం సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. అలాగే గర్భంలో ఉన్న శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి.
– పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావాల్సినంత మెగ్నీషియాన్ని అందిస్తాయి. దీంతో ఎముకలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా శరీరంలో జీవక్రియలను, థైరాయిడ్‌, బ్లడ్‌షుగర్‌ను రెగ్యులేట్‌ చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *