చిరు కొత్త సినిమా జ‌న‌వ‌రిలోనే…

సినిమా

చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా మేజర్‌ చిత్రీకరణ పార్టు జనవరికి పూర్తి కానుంది. ఇది పూర్తయిన వెంటనే తర్వాతి చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశాడు. ఈసారి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో చేయబోతున్నాడు చిరంజీవి. ఆ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే విధంగా ప్రారంభోత్సవ పనులకు ముహూర్తం ఖరారు చేశారట. రెగ్యులర్‌ చిత్రీకరణ మాత్రం ఫిబ్రవరి గానీ, మార్చి నుంచిగానీ ఉండనుంది. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ కోసం గడ్డంతో ఉన్నాడు. కానీ కొరటాల చిత్రంలో మాత్రం చిన్నపాటి గడ్డంతో విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ బాణీలు సమకూర్చునున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *