చిరంజీవి చేతుల మీదుగా ఆలీ సోదరుడి సినిమా ట్రైలర్ విడుదల

సినిమా

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా “దేశంలో దొంగలు పడ్డారు” సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఆలీ సోదరుడు ఖయ్యూం ముఖ్యపాత్రలో నటించడం గమనార్హం. గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తనిష్క, రాజన్‌, షానీ, పృథ్వీరాజ్‌, సమీర్‌, లోహిత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “నా చిరకాల మిత్రుడైన ఆలీ సోదరుడు నటించిన సినిమా ట్రైలర్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌతమ్ రాజ్ కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించినా కూడా.. మంచి అనుభవం ఉన్న డైరెక్టరులాగే సినిమా తీశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సామాజిక సమస్య మీద సినిమా తీయడానికి సంకల్పించిన నిర్మాతలకు కూడా నా అభినందనలు. ఖయ్యూం సినిమా అంటే అందరూ కామెడీ సినిమా అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇది పూర్తిగా సీరియస్ నెస్ ఉన్న సినిమా అని ట్రైలర్ చూశాక అర్థమైంది. ఈ సినిమా నేను ఖయ్యూంకు టర్నింగ్ పాయింట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని చిరంజీవి తెలిపారు.

ఆలీ సోదరుడు ఖయ్యూం గతంలో ఎంజాయ్ సినిమాతో హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక సినిమాలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. దాదాపు 90 సినిమాల్లో ఖయ్యూం నటించారు. బ్లేడ్ బాబ్జి, బంపర్ ఆఫర్, బుజ్జిగాడు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, సూపర్, ఇద్దరమ్మాయిలతో లాంటి చిత్రాలు ఖయ్యూంకు మంచి పేరు తీసుకొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *