పోలీసుల్లో పౌరుషం చచ్చిపోయింది.. జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

న్యూస్

అనంతపురం తాడిపత్రి మండలం పెద్ద పడమలలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి ప్రబోధానంద ఆశ్రమానికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా ఆయన.. రోడ్డుపై బైఠాయించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ.. పోలీసుల తీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేం చేశానని అడ్డుకున్నారని ప్రశ్నించారు.

శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద స్వామి శిష్యులకు, గ్రామస్థులకు మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు బండల ఫ్యాక్టరీలో మిషన్లకు, ట్రాక్టర్లు, బైకులకు నిప్పటించారు. విషయం తెలుసుకున్న ఎంపీ జేసీ..స్థానికులను పరామర్శించేందుకు అనుచరులతో కలిసి బయల్దేరారు. దీంతో పోలీసులను ఆయనను అడ్డుకున్నారు.

ఈ ఘటనపై ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్లో పౌరుషం చచ్చిపోయిందని, ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో రౌడీలకు సపర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. డేరా బాబా ఆశ్రమానికి వెళ్లిన పోలీసులు.. ప్రబోధానంద ఆశ్రమానికి ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *