సారిడాన్ తలనొప్పి మాత్రలను మార్కెట్లో విక్రయించేందుకు సుప్రీం కోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు మరో రెండు రకాల మందుల విక్రయానికి కూడా సుప్రీం అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిక్సెడ్స్ డోన్ కాంబినేషన్ కలిగిన 328 రకాల మందుల విక్రయాలను 2016 మార్చి నాటి నుంచి నిలుపుదల చేసింది. అప్పటి నుంచి ఈ మందుల విక్రయాలపై బ్యాన్ కొనసాగుతోంది. అయితే మార్కెట్లో మాత్రం ఇవి దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇన్నాళ్లుగా సదురు మందుల కంపెనీలు సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. 1988 నాటి నుంచి దేశంలో ఇదే తరహా కాబినేషన్ మందుల తయారీ ఉందని, గతంలో ప్రభుత్వం 15 రకాల ఔషదాలను విక్రయానలు రద్దు చేస్తే కోర్టు వాటికి తిరిగిన అనుమతిని ఇచ్చిన విషయంపై సుప్రీంలో వాదోపవాదాలు జరిగాయి.
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డిట్యాబ్ )సూచన మేరకే 328 రకాల ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ల కలిగిన మందుల విక్రయాలు నిలిపేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నిర్ణయాన్ని ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్స్ కూడా స్వాగతించింది. ఈ సంస్ధ కన్వీనర్ డాక్టర్ గోపాల్ దబేదే పిక్సెడ్ డోస్ కాంబినేషన్ లతో తయారైన మందులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇలాంటి కాంబినేషన్ మందులను డాక్టర్లు సూచించరని శాస్త్రీయంగా కూడా ఇది సరైంది కాదని ఆనాడు పేర్కొన్నారు. 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ఆదేశాల డిట్యాబ్ ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్లపై పరిశీలన జరిపింది. ఇలాంటి వాటిని వినియోగం ప్రజలకు ప్రమాద కరమని మరోసారి స్పష్టం చేసింది.
328 రకాల ఔషదాల విక్రయాలపై నిషేదంపై కేంద్రం ఒక నిపుణల కమిటీని కూడా వేసింది. DTAB , నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు పరిశీలిస్తే, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, FDC లను నిషేధించింది. అయితే సారడాన్, మరో రెండు ఔషదాల విక్రయాల విషయంలో ఇచ్చిన సడలింపుకు సంబంధించి సుప్రీం ప్రస్తుతం స్టే మాత్రమే ఇచ్చింది. విక్రయాలను వల్ల నష్టం లేదని, ప్రజలు వినియోగించుకోవచ్చని మాత్రం తన తీర్పులో పేర్కొనలేదు.