జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో సోషల్ మీడియాలో  ఉద్యమం 

న్యూస్
నల్గొండ :  జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో సోషల్ మీడియాలో అమృత ఉద్యమం చేపట్టింది. మిర్యాలగూడలో పరువుహత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసును ఛేధించే పనిలో ఉన్నారు ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ హత్యకు గురికావడంతో భార్య అమృత తల్లడిల్లిపోయింది. కడుపులో ప్రణయ్ ప్రతిరూపాన్ని మోస్తూనే భర్త హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. .ప్రణయ్‌ను చంపినవారిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. పరువు హత్యలు, కుల రహిత సమాజం కోసం పోరాటం చేస్తానని పేర్కొంది. ఈ తరహా కేసులను తర్వితిగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అమృత కోరుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందనే కక్షతో కన్నకూతురి భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో అమృత తండ్రి అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *