చినబాబు భజన కోసం… ఇంటర్నేషనల్ కన్సెల్టీన్సీ

గాసిప్స్
 నాన్న గారి అడుగుజాడల్లోనే…..ఏపీ మంత్రి నారా లోకేష్‌ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆయన దార్శనికత., విజన్‌లలో కాదండోయ్…. కోటరీని మెయింటెయిన్‌ చేయడంలో….. చినబాబు తీరు చూసి అధికార వర్గాలు సైతం షాకవుతున్నాయి. ఇక సొంత భజన కోసం నియమించుకున్న ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీ కూడా ప్రచార బాధ్యతలు చూస్తోంది. ఈ కన్సెల్టెన్సీ కార్యాలయాన్ని ఏకంగా సిఎంఓలోనే పెట్టేశారు. నెలకు కోట్ల రుపాయలు ఎదురు డబ్బులిచ్చి మరీ ఉచితంగా కార్యాలయం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికి అంతు చిక్కదు.
బాస్‌ కనుసన్నల్లో సాగే పబ్లిసిటీ వ్యవహారం కాబట్టి ప్రశ్నించే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇక ముఖ్యమంత్రి సమీక్షలు., ప్రచార బాధ్యతలు నిన్న మొన్నటి వరకు పరకాల చూసేవారు. ఆయన రాజీనామా తర్వాత సొంత వారికి అన్యాయం జరుగుతున్నదనుకున్నారో ఏమో కాని మళ్లీ అందర్నీ చేరదీసి సిఎంఓలో చేర్చుకున్నారు. సామాజిక సమీకరణలే ఇక్కడ బలంగా పనిచేశాయనే గుసగుసలున్నాయి. మొత్తంగా చినబాబు కనుసన్నల్లో సాగుతున్న ఈ తతంగమంతా అటు ఉద్యోగ వర్గాల్లో., ఇటు జర్నలిస్ట్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారాయి.అణువణువున నింపుకున్న సంకుచిత భావనలు ఆయన్ని నడిపిస్తున్నాయని చెబుతున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండానే పదవిలోకి వచ్చిన లోకేష్‌ సలహాలు., సూచనల కోసం ఓ కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. తన కదలికలు ., పార్టీ అనుకూల వార్తలు., చంద్రబాబు ప్రచార బాధ్యతలు వీరి కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. సిఎంఓ మొత్తం తమ జాగీరుగా భావించే ఈ బృందం ప్రభుత్వాన్ని తామే నడిపిస్తున్నామనే కలర్ ఇస్తుంటారు.
ఇక అనుకూల మీడియాలోని సొంత సామాజిక వర్గీయులతో ఓ సెల్ చినబాబు కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ప్రెస్‌మీట్‌లలో సైతం ఆయన చుట్టూ కాపాలా కాస్తూ ఇబ్బందికర ప్రశ్నలు రానీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
నాన్నగారికి ఏ మాత్రం చెడ్డ పేరు రానివ్వనని చిలకపలుకులు చెప్పే చినబాబు మీడియా దగ్గరకొచ్చేసరికి సొంత టీం సలహాలు లేనిదే పెదవి విప్పరట….. ఎవరితో మాట్లాడాలి….ఎదుటి వాళ్లు సొంత సామాజిక వర్గమా కాదా…., తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసేది ఎవరు ఇలాంటి విషయాలు చేరవేసేందుకు నలుగురైదుగుర్ని నియమించుకున్నారు.
ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలోను ఇదే తంతు…. ప్రభుత్వ పథకాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే క్రమంలో చినబాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసే వారిని దూరం పెట్టారు. ఇటీవల ఆయనకు సంబంధించిన మంత్రిత్వ శాఖల పనితీరుపై పత్రికల్లో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆయా శాఖలే నేరుగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. డిజైన్‌ లు మాత్రం బయటి వారితో చేయిస్తున్నారు. మంత్రి సొంత సిబ్బందే కన్సల్టెన్సీల పేరుతో నంద్యాల ఎన్నికల నాటి నుంచి పబ్లిసిటీ వ్యవహారాల్లోకి దిగినట్లు అధికారులు చెబుతున్నారు.

1 thought on “ చినబాబు భజన కోసం… ఇంటర్నేషనల్ కన్సెల్టీన్సీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *