పిల్ల‌లు పుట్ట‌కుండా చేస్తున్న‌ కాస్మోటిక్స్‌

హెల్త్

సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డానికి కాస్మోటిక్స్ ఒక బ‌ల‌మైన కార‌ణంగా క‌నిస్తోంద‌ని ఇటీవ‌ల అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్త‌న్నాయి. ప్ర‌కృతికి, మ‌నిషికి న‌ష్టం క‌లిగిస్తున్న వస్తువులు, ప‌దార్ధాల అధ్య‌య‌నంలో భాగంగా సౌంద‌ర్య ర‌క్ష‌ణ కోసం, సౌంద‌ర్య కోసం వుప‌యోగించే ఉత్ప‌త్తుల వ‌ల్ల మ‌హిళ‌ల్లో పున‌రుత్ప‌త్తికి స‌బంధించిన హార్మోన్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతున్న‌ట్లు ఆ అధ్య‌య‌నంతో క‌నుగొన్నారు.
18 నుంచి 44 ఏళ్ళ లోపు వ‌య‌సున్న 143 మంది మ‌హిళ‌ల‌పై ప‌రిశోధ‌న చేసి సుమారు 509 మూత్రం న‌మూనాలు సేక‌రించారు. కాస్మోటిక్ దుష్ప్ర‌భావం వ‌ల్ల సంతానం క‌ల‌గ‌డానికి ఉప‌క‌రించే శ‌రీరంలో వివిధ భాగాల్లో కొత్త స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని గుర్తించారు. ముఖ్యంగా కండ‌రాల‌పై, ఎముక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుత‌న్న‌ట్లు ఈ అధ్య‌యంలో తేల్చారు. ముఖ్యంగా కాస్మోటిక్ మ‌హిళ‌ల రుతు క్ర‌మంపై అధికా ప్ర‌భావం చేపుతున్నాయ‌న్న చేదు వాస్త‌వాన్ని మ‌హిళ‌లు గ్ర‌హించాల‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఎక్కువ ర‌కాల ర‌సాయనాలు క‌లిగిన కాస్మోటిక్ ఉత్ప‌త్తుల వ‌ల్లే ఇలాంటి తీవ్ర‌మైన స‌మ‌స్యలు త‌లెత్తుతున్నాయ‌న్న‌ది నిర్ధార‌ణ అయింద‌న్నారు ప‌రిశోధ‌కులు… అందం, ఆక‌ర్ష‌ణ కోసం విచ్చ‌ల‌విడిగా కాస్మోటిక్స్‌ను వాడుతూ ఆరోగ్యాల‌ను పాడుచేసుకోవ‌డ‌మే కాకుండా మ‌హిళ‌ల‌ను పున‌రుత్ప‌త్తి హార్మోన్ల నాశ‌నానికి దారి కార‌కుల‌మ‌వుతున్నామ‌ని ప‌రిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాస్మోటిక్‌లోని కొన్ని ప్ర‌మాదక‌ర ర‌సాయ‌నాలు శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్ స్థాయిల‌ను పెంచుతున్నాయ‌ని, దీని ప్ర‌భావం వ‌ల్ల రొమ్ము క్యాన్స‌ర్‌కు దారితీస్తోందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *