pawankalyan

టీచర్లు ఆదర్శప్రాయంగా వుండాలి

న్యూస్

 

ఏలూరు : విద్య వ్యాపారమైపోయిందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులతో ఏలూరులో ఆయన సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరులో చదువుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. మంత్రి నారాయణ తనకు మంత్రిగా కాదు ఒక లెక్చరర్ గా తెలుసనని అన్నారు. విద్య ఎంత బలమైన వ్యాపారంగా మారిందనడానికి నారాయణ విద్యాసంస్థల నారాయణనిదర్శనమని అయన అన్నారు. ఈ ఉపాధ్యాయులే ఆదర్శంగా ఉండాలన్నారు. సమాజంలో స్పందన లేని పరిస్థితులు రావడానికి విలువలు లేని విద్యే కారణమని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజ నిర్మాణంలో టీచర్లే కీలకమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *