bigboss

హోస్ట్‌గా నాని ప్లాప్ షో

సినిమా
వెండి తెర‌పై రాణిస్తున్న స‌హ‌జ న‌టుడు నాని…బుల్లి తెర‌పై మాత్రం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచార‌నే చెప్పొచ్చు. బిగ్‌బాస్ సీజ‌న్‌-2 హోస్ట్‌గా అత‌ను ప్లాప్ షో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చార‌ని మాటే ఎక్కువ‌గా వినిపిస్తోంది. నిజానికి బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్ కంటే కూడా హోస్ట్ పాత్రే అత్యంత కీల‌క‌మైంది. ఎందుకంటే గేమ్‌లో మంచీచెడుల‌ను ప్ర‌జ‌ల కోణం నుంచే విశ్లేష‌ణ చేసే గురుతర బాధ్య‌త హోస్ట్‌దే. అంటే నానిదే. అలాంటి ప్ర‌య‌త్నం నాని ఏనాడూ చేయ‌లేద‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.
 మొత్తానికి హోస్ట్‌గా నాని వ్య‌వ‌హార శైలి చూస్తే అత‌ని స్థాయి కూడా అంతేననిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బాబు గోగినేని, కౌశ‌ల్ మ‌ధ్య రాజ‌మౌళి నాస్తిక‌త్వం విష‌యంలో  జ‌రిగిన గొడవలో కీలకమైన విషయం…. తాను నాస్తికుడిని అని చెప్పి బాహుబలి విడుదల సమయంలో దేవాలయానికి వారు వెళ్లడం తప్పు అని బాబు ప్రశ్నించారు. ఆస్తికుడా, నాస్తికుడా అన్నది వారి వారి వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం.  కానీ నాస్తికుడు అని ప్రకటించుకుని ఆలయానికి వెళ్ల‌డాన్ని నాస్తికులు వ్యతిరేకించడం సహజం. ఒక‌వేళ వ్య‌తిరేకించ‌క‌పోతేనే ఆశ్చ‌ర్య‌పోవాలి. ఈ నేస‌థ్యంలో రాజమౌళిని ఎవరేమ‌న్నా  ఊరుకోమని  కౌశల్ మాట్లాడం వెనక రహస్యాన్ని ప‌సిగ‌ట్ట‌లేని స్థితిలో ఎవ‌రూ లేర‌ని గుర్తించుకోవాలి.
nani
ఇక్క‌డ కౌశ‌ల్ గేమ్ ప్లాన్ రాజ‌మౌళిని అభిమానించే వారి ఓట్లు ద‌క్కించుకోవ‌డం మాత్రమే. ఈ వివాదం నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు…ఆయ‌న డీల్ చేసిన విధానం హోస్ట్‌గా అత‌ని అర్హ‌త‌ల‌పై అనుమానం క‌లిగించింద‌నే చెప్పాలి. నాని కూడా కౌశల్ స్థాయిలోనే స్పందించడం కూడా స్వామి భక్తి ప్ర‌ద‌ర్శ‌న‌ను చూపింది. తాను హోస్ట్ స్థానంలో ఉన్నాన‌నే విష‌యాన్ని విస్మ‌రించి, సినిమా ప్ర‌యోజ‌నాలను దృష్టిలో పెట్టుకొని వ్య‌వ‌హ‌రించార‌నేది ప‌చ్చి నిజం. పైపెచ్చు రాజ‌మౌళి దృష్టిలో ప‌డేందుకు ఇదో చ‌క్క‌ని అవ‌కాశంగా భావించార‌నే వారు లేక‌పోలేదు.
nani
ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ ప్ర‌యోజ‌నాలను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ వేదిక‌ను వాడుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.  కాని 113 రోజుల పాటు విలువైన స‌మ‌యాన్ని వెచ్చించి షోను ఆద‌రించిన కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను ఫూల్స్ చేయ‌డానికి బిగ్‌బాస్ నిర్వాహ‌కులు, హోస్ట్ నాని, ఇత‌ర షో భాగ‌స్వాములు వెనుదీయ‌క‌పోవ‌డ‌మే విషాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *