kaushal bigboss

బిగ్‌బాస్ ఓడాడు- కౌశ‌ల్ గెలిచాడు

సినిమా
 Bigg boss షో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో అనడంలో సందేహం లేదు. నిన్నటితో షో  ముగిసింది. కౌశల్ విజేతగా నిలవగా, గితామాధురి ర‌న్న‌ర్‌గా నిలిచారు. 113 రోజుల షోను ఒక సారి పరిశీలిస్తే అనేక అంశాలు చర్చకు వస్తాయి.

షో విజయానికి మూలం….

షోను ప్రజలు బాగా ఆదరించారు. అందుకు కారణం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోవడమే. మనిషి వ్యక్తిగత జీవితంలో బాగా బిజీ అయ్యాడు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ కావడానికి ఉన్న అవకాశం టీవీ సీరియల్ మాత్రమే.  ఇపుడు వస్తున్న సీరియల్స్ , ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేక్ పోతున్నాయి. కొత్త వాటికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎదుటివారి వ్యక్తి గత విషయాలపై ఆస‌క్తి చూపడం ఒక  వాస్తవం. ఈ నేపథ్యంలో వచ్చిన షో నే బిగ్ బాస్.
kausal bigboss
ప్రజాదరణ పొందిన షో ప్రజలను ఆకట్టుకోలేదు. దీనికి కారణం షో నిర్వహణ‌లో బలహీనతే అని చెప్పక తప్పదు. షో లో  వివిధ‌ రంగాలకు చెందిన 16 మందిని మొదట ఎంపిక చేశారు. మధ్యలో వైట్ కాలర్ పేరుతో పూజను ఎంపిక చేశారు. మేధావి వర్గం నుంచి బాబు గోగినేని, గాయని గీతామాధురి, యాంకర్ శ్యామల, జర్నలిస్ట్ దీప్తి, కౌశల్  త‌దిత‌రుల‌ను ఎంపిక చేశారు. అయితే మొత్తం టాస్క్‌ల‌ను  పరిశీలిస్తే  ఇంటిలోని సభ్యుల ప్రతిభను వెలికితీసేవి ఒక్కటి కూడా లేవు. పై పెచ్చు అసహజమైనవే ఉన్నాయి. ఫలితంగా టాస్క్‌ల‌లో సభ్యులందరినీ ఆకట్టుకోలేక పోయారు. అనేక సందర్భాలలో వారి ప్రవర్తన అభ్యంతరంగా ఉంది. జనం షోను జనం చూస్తున్నా షోకి దగ్గర కాలేక పోయారు.

 కౌశల్ విజయానికి కలిసి వచ్చిన అవకాశాలు…..

నిజానికి ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదు. షో నిర్వహణలో విపరీత ధోరణలు, బలహీనతలు. వీటి ఆధారంగా ఎవరైనా తెలివిగా వ్యవహారాలు చ‌క్కదిద్దుకుంటే ఫ‌లితాన్ని తమకు అనుకూలంగా వుండేలా మార్చు కోవచ్చు అనడానికి కౌశ‌ల్ విజయం ఒక ఉదాహరణ మాత్రమే.
kousal bigboss
1. ఎలిమినేషన్ నుంచి అంతిమ‌ విజేత వరకు జరిగిన ఓటింగ్ విధానం సరిగా లేదని స్పష్టం అవుతోంది. శ్ర‌ద్ధ పెట్టి ఓటు వేయ‌దగ్గ  విషయం షోలో లేకపోవడం వల్ల సాధారణ జనం ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల ముందస్తు చర్యలు తీసుకున్న వారు ఫలితాన్ని శాసించ‌గ‌లిగారు. ఉదాహరణకు ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక జరిగితే 90 శాతం పోలింగ్ జరిగితే అపుడు రిగ్గింగ్ జరిగినా పలితం మారదు. అదే 50 శాతం పోలింగ్ జరిగితే అపుడు  రిగ్గింగ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సరిగ్గా బిగ్ బాస్ షోలో కూడా క‌చ్చితంగా ఇదే జరిగింది. ప్రజలు అస‌క్తి చూపక పోవడం వల్ల‌ కౌశల్ ముందుగా  చేసుకున్న ఏర్పాట్లు అతని గెలుపున‌కు దోహదప‌డ్డాయి.
2.  కలిసి వచ్చిన ఇంటి సభ్యుల ప్రవర్తన….
కౌశ‌ల్ గేములో చేసిన ఘనకార్యం లేకపోయినా మిగిలిన వారు కలిసి వ్యవహరించిన తీరు అతనికి ఉపయోగ పడింది. ప్రారంభంలో గీత అందరికన్నా ముందున్నా మధ్యలో సామ్రాట్‌తో  వ్యవహారించిన తీరు గీత  గ్రాప్ బాగా పడి పోయి గెలుపు గీత‌ను మార్చింది.   కారు టాస్క్ లో శ్యామల, దీప్తి, సామ్రాట్, తనీష్ ఆడిన విధానం వారి గ్రాప్ తీవ్రంగా పడిపోయేందుకు కార‌ణాలయ్యాయి. ఒక వైపు స్నేహితులుగా ఉంటూనే గెలవడం కోసం కారులో ప్రవర్తించిన తీరు అసహ్యంగా మారింది. ఇక్కడ కౌశ‌ల్ చేసింది కేవలం వాటిని పదేపదే ప్రస్తావించడం మాత్రమే.
3. సమాజంలో మనం, నేను అనే వాదనలు ఉంటాయి. కౌశ‌ల్ నేను అన్న భావంతో గేమ్ ఆడారు. మిగిలిన వారు మనం అన్న మాట అన్నా ఆచరణలో అందుకు భిన్నమైన ఆట తీరు కనబ‌రిచినారు. గేమ్‌లో కౌశల్  అద్భుతమైన ప్రతిభను చూపక పోయినా ప్రజల్లో ఉన్న వ్యక్తిగత పోకడలు , మిగిలిన వారి బలహీనతలు అత‌ని విజయానికి దోహదప‌డ్డాయి.

ఎక్సెప్రెస్ మాట:  షో నిర్వ‌హ‌ణ‌లో బిగ్‌బాస్ అట్ట‌ర్ ప్లాప్ కావ‌డ‌మే కౌశ‌ల్ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం.

 -ఎం.పురుషోత్త‌మ్‌రెడ్డి, తిరుప‌తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *