chandrababu-chaganti

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటితో పోటీ అంటున్న‌చంద్ర‌బాబు 

గాసిప్స్
ప్ర‌వ‌చ‌న‌క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు పేరు విన‌ని తెలుగు వారు ఉండ‌రు. ఆయ‌న తెలుగు రాష్ర్టాల‌తో పాటు దేశ‌విదేశాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌వ‌చ‌నాలు చెబుతూ ఆధ్యాత్మిక త‌త్వ‌వేత్త‌గా పేరు గ‌డించారు. ఇప్పుడాయ‌న‌కు ఆంధ్రా సీఎం చంద్ర‌బాబు రూపంలో పెద్ద స‌వాల్ ఎదురైంది. ఓసోస్ ఆ మాత్రం ప్ర‌వ‌చ‌నాల‌ను నేను చెప్ప‌లేన‌ను కుంటున్నావా?  రా నా ముందుకొచ్చి నీ బ్ర‌హ్మ విద్య‌ను ప్ర‌ద‌ర్శించు అని మ‌న సీఎం గారు స‌వాల్ విసురుతున్నారు.
ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రాజ‌ధాని ప్రాంత‌మైన ఉండ‌వ‌ల్లిలో పే..ద్ద బ‌హిరంగ స‌భలో బాబు గారు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. బాబు గారు ప్ర‌వ‌చ‌నాలు చెబుతార‌ని తెలిస్తే తెలుగు రాష్ర్టాల్లోని మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధులంతా పోలోమ‌ని విజ‌య‌వాడ‌కు రావ‌డం, అప్పుడెప్పుడెప్పుడో బాబు గారు అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో  పుష్క‌ర‌ణిలో స్నానానికి వెళితే తొక్కిస‌లాట జ‌రిగి ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్టు, ఇక్క‌డ అదే విప‌త్తు రిపీట్ అవుతుంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించ‌డంతో అస‌లు విష‌యాన్ని ప్ర‌చారం చేయ‌లేద‌నుకోండి. అయినా బాబు గారు త‌న‌దైన శైలిలో సూక్తులు వ‌ల్లిస్తూ అక్క‌డికి వ‌చ్చిన వారిని భ‌క్తి పార‌వ‌శ్యంలో ముంచెత్తారు.

ఇంత‌కూ ఆయ‌న ఏం చెప్పారంటే …”మ‌న కులం, మ‌న ప్రాంతం, మ‌న మ‌తం అని ఆలోచిస్తుంటే …అవేమీ తిండిపెట్ట‌వు. తిండి పెట్టేది మ‌నం చేసే ప‌నులే. 2014 ఎన్నిక‌ల్లో ఎవ‌రెన్ని మాట్లాడినా ..నేను మాత్ర‌మే రాష్ర్టాన్ని కాపాడ‌గ‌ల‌న‌ని అవ‌కాశం ఇచ్చారు. ఆ న‌మ్మకాన్ని నిల‌బెట్టుకున్నాం. కేంద్రం స‌హ‌క‌రించ‌కున్నా అభివృద్ధి చేశాం” అని చంద్ర‌బాబు ప్ర‌వ‌చించారు.

 హే…భ‌గ‌వాన్‌…కాపులను బీసీల్లో చేర్చ‌డం, మ‌త్స్య‌కారులు, ఇత‌ర ఒక‌ట్రెండు కులాల‌ను ఎస్సీల్లో చేరుస్తామ‌ని హామీ ఇచ్చి ఓట్ల‌ను కొల్ల‌గొట్టిందో మ‌న ప్ర‌వ‌చ‌న‌క‌ర్త బాబు గారు చెప్పాల్పి ఉంది. బాబు గారు ప్ర‌వ‌చించిన‌ట్టు మ‌న కులం, మ‌న ప్రాంతం, మన మ‌తం అని ఆలోచిస్తే తిండిపెట్ట‌ని మాట నిజ‌మే కానీ మీకు మాత్రం ఓట్ల వ‌ర్షం కురిపించింది వాస్త‌వం కాదా మ‌హానుభావా?. ఇప్పుడర్థ‌మైందా  బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి గారి ఆందోళ‌న‌కు ఆందోళ‌న‌కు గ‌ల కార‌ణ‌మేంటో?
   – సొదుం ర‌మ‌ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *