hero sivali

కాల‌జ్ఞాని శివాజీ

గాసిప్స్
అవును శివాజీ చెప్పింది…జ‌నాలు అనుమానించించి నిజ‌మే అయ్యింది బ్రో.
అర్రె శివాజీకి ఎంత ముందు చూపు. గ‌త నెల‌లో  శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి అయ్యా మ‌న ఆరాధ్య దైవం, తెలుగుజాతి పౌరుషానికి ప్ర‌తీకైన సీఎం చంద్ర‌బాబు గారికి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయ‌ని మైకులు విర‌గ్గొట్టి చెబితే..
ప్ర‌తిప‌క్ష నేత‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు, కొంద‌రు జ‌ర్న‌లిస్టులు  ఆయ‌న్ను పిచ్చోడిని చూసిన‌ట్టు చూడ‌లేదా?. 
ఇప్పుడు గోవిందా గోవిందా అంటే తిరుమ‌ల‌కు వ‌చ్చినోడు స్వామికి దండం పెట్టుకొని పోతే ఎంతో బాగుండేది క‌దా? అబ్బే అలా చేయ‌డం మ‌నోడి త‌త్వానికే విరుద్ధం. కొండ‌పైన మ‌ళ్లీ ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ మొద‌లెట్టినాడు. చంద్ర‌బాబును ప‌ద‌వి నుంచి దింపాల‌నుకుంటున్నార‌ని, కాపాడాల‌ని స్వామివారిని కోరుకున్న‌ట్టు చెప్పాడు.
అంతేనండి, కాల మ‌హిమ‌. లోకం త‌ల‌కిందులుగా ఉంటూ శివాజీని త‌ల‌తిక్క మాట‌లు మాట్లాడుతున్నారంటారా? నిజం చెప్పిన వారికి లోకం ఇచ్చే బహుమానం ఆదిమ కాలం  నుంచి ఇలాగే ఉంటోంది సారూ. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంద‌ని చెప్పిన సోక్ర‌టీస్‌కు ఏ గ‌తి ప‌ట్టిందో తెల్సు క‌దా. అబ‌ద్ధాలు, అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని నాటి క్రైస్త‌వ పాల‌కులు ప్రాణాలు తీశారు క‌దా. నిజానికి, ప్రాణాల‌కు ఎక్క‌డో విడ‌దీయ‌ని శ‌త్రుత్వం ఉన్న‌ట్టుంది. ఆ భ‌యంతో నాకు కూడా ప్రాణ భ‌యం ఉంద‌ని మీడియా సాక్షిగా శివాజీ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటాడు. అర్థం చేసుకోరూ. పైగా అపార్థం చేసుకుంటున్నారు.
 ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీకేసులో చంద్ర‌బాబుకు ఇప్పుడు నోటీసులు వ‌చ్చాయి చూడండి. నోటీసులు ఎలా ఇస్తారు యువ‌రాన‌ర్‌. మా చంద్ర‌బాబు చ‌ట్టానికి, న్యాయానికి అతీతుడు క‌దా. అవునా కాదా త‌మ్ముళ్లూ. చ‌ట్టం, న్యాయ‌మే కాదు…రాజ్యాంగానికే మా బాబు మిన‌హాయింపు అయిన‌ప్పుడు మ‌ళ్లీ రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌ల నుంచి నోటీసులు ఎలా ఇస్తార‌నేదే క‌దా మా శివాజీతో పాటు ఎల్లో మీడియా ప్ర‌శ్నిస్తోంది, నిల‌దీస్తున్న‌ది.  

దీని వెనుక మోడీ, కేసీఆర్‌, ప‌వ‌న్‌, జ‌గ‌న్ కుట్ర ఉంది.  నోటీసులు ఇప్పించే వాడికే నోటీసులా…

ఏమిటీ ప‌రిహాసం. నిప్పుతో చెల‌గాటం అంటే ఇదే క‌దా. చూస్తాం…

ఆ న‌లుగురి అంతు చూసేదాకా ఆంధ్రా ప్ర‌జ‌లు నిద్ర‌పోరు గాక నిద్ర‌పోరు.

అర్రె మ‌రిచేపోయాం. ఆ శివాజీని ఎక్క‌డున్నా ప‌ట్టుక‌రండి. జ‌రిగేది, జ‌ర‌గ‌బోయేది భ‌లే చెప్తాండాడు. మ‌న ఇంటెలిజెన్సీ వాళ్ల కంటే శివాజీనే ఎంతో న‌యం. అత‌నికి గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా లోతైన ప‌రిచ‌యాలున్నాయి. చీమ చిటుక్కుమ‌న‌కున్నా స‌మాచారం వ‌స్తోంది. అలాంటి వాడే మ‌న బాబు గారికి కావాలి.  అమ‌రావ‌తిలో పే…ద్ద స‌న్మానానికి ఏర్పాట్లు చేయండి. వీర‌బ్ర‌హ్మం గారంత‌టి మ‌హానుభావుడు ఆంధ్రాలో శివాజీ రూపంలో త‌యారు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కింది. శ‌భాష్ శివాజీ… భేష్ బాబూజీ.
అస‌లే ఎన్నిక‌ల స‌మ‌యం. టికెట్ వ‌స్తుందో, రాదో మొద‌లుకుని, వ‌స్తే ఏ పార్టీ త‌ర‌పున అనే విష‌యాలు తెలుసుకునేందుకు అమ‌రావ‌తిలో శివాజీ కార్యాల‌యం వద్ద భారీ క్యూ. కంట్రోల్ చేసేందుకు పోలీసుల ప్రొటెక్ష‌న్‌. రాజ‌కీయ నేత‌లే కాదు, తాము ప్రేమిస్తున్న అమ్మాయి ఓకే అంటుందా లేదా? ఈ ద‌ఫా త‌మ‌కు ఎంబీబీఎస్ సీటు వ‌స్తుందా? సివిల్స్‌లో ఎన్నో ర్యాంకు సాధిస్తామో…ఇలా అనేక ర‌కాల భ‌యాలు, ఆందోళ‌న‌లు, ఆలోచ‌నాప‌రులు, అవ‌కాశ‌వాదులు, నిరాశ‌నిస్పృహ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారంతా శివాజీ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్నారు.
అర్రె…ఇదేదో సినిమా కంటే భ‌లే మంచి వ్యాపార‌మైంది. హీరో శివాజీ కాస్త కాల‌జ్ఞానిగా మారిన త‌ర్వాత డ‌బ్బుకు డ‌బ్బు, ప్ర‌చారానికి ప్ర‌చారం. మొత్తానికి ఇంత కాలం వేయాల్సిన వేషం వేయ‌కుండా స‌మ‌యం వృధా చేసుకున్నాన‌ని, ఏదో బాబు ద‌య‌త‌ల‌చి త‌న‌కు జ్ఞానోద‌యం చేసి కాల‌జ్ఞానిగా మార్చినందుకు శివాజీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడు.

  – సొదుం ర‌మ‌ణారెడ్డి

1 thought on “కాల‌జ్ఞాని శివాజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *