Jahanavi

కాస్ట్యూమ్స్ కోసం 30 ప్రయోగాలు చేసిందట

సినిమా

హైదరాబాద్‌: ధడక్ తో ఇండస్ట్రీకి పరిచయమై తొలి సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించింది శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. తన అందచందాలతో ఫ్యాన్స్ ను కట్టిపడేసింది జాన్వీ. ఈ చిత్రంలో సరైన లుక్ కోసం ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా దాదాపు 30 సార్లు ప్రయోగాలు చేశారని జాన్వీ తెలిపింది. తాజాగా ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం ఫొటో షూట్‌లో పాల్గొన్న సందర్భంగా కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది. ధడక్ లో రాజస్థానీ అమ్మాయిగా అందంగా కనిపించేలా తయారు కావడానికి జాన్వీ కపూర్ చాలా కష్టపడినట్లు చెప్పింది.

కాస్టూమ్స్ కోసం ఓ రోజు మనీష్‌ దగ్గరికి వెళ్లాను. ఆరోజు సుమారు 30 రకాల లుక్స్‌ ప్రయత్నం చేశాం. సరైన లుక్‌ కోసం మనీష్ చాలా ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త కొత్త దుస్తులు డిజైన్‌ చేస్తారు. కాస్ట్యూమ్స్ విషయం ఆయనకే ఎక్కువ తెలుసు. ఆ బాధ్యతలను మనీశ్ కే వదిలేశానని చెప్పుకొచ్చింది జాన్వీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *