zero budject politics

జీరో బ‌డ్జెట్ పాలిటిక్సే ప్ర‌త్యామ్నాయం-డ‌బ్బు ర‌హిత రాజ‌కీయ ఉద్య‌మ‌కారుడు పోతిరెడ్డి మాధ‌వ‌రెడ్డి

Uncategorized
zero budject politicsసామాన్యుల‌కు చోటు ద‌క్కిన‌ప్పుడే ప్ర‌జాస్వామ్యానికి విలువ‌. కాని రాజ‌కీయాల్లో సేవాప‌రుల‌కు బ‌దులుగా స్వార్థ‌ప‌రులు ప్ర‌వేశించి ఓటును నోటుతో కొనుగోలు చేస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. ఈ దుర్మార్గ సంస్కృతిని పార‌దోలాలంటే డ‌బ్బు ర‌హిత రాజ‌కీయ‌మ‌నే అస్ర్తాన్ని చేబూనాడు  పోతిరెడ్డి మాధ‌వ‌రెడ్డి. వృత్తి రీత్యా కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి అయినా ప్ర‌వృత్తి రీత్యా సామాజిక కార్య‌క‌ర్త‌. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అనే స‌మ‌ర నినాదాన్ని త‌ల‌కెత్తుకొని ఊరూరూ తిరుగుతూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రుస్తూ గాంధీజీ క‌ల‌లుగన్న భార‌తావ‌ని కోసం ఆయ‌న అవిశ్రాంత కృషి చేస్తున్నారు. ఇంత‌కూ జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటో, అందుకోసం ఏం చేస్తున్నార‌నే అంశాల‌పై ఆయ‌న మాటల్లోనే తెల్సుకొందాం...
 ప్ర‌శ్నః జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ ఆలోచ‌న‌, ఆశ‌యం బీజాలు మొల‌కెత్త‌డానికి  ప్రేర‌ణ ఏంటి?
జ‌వాబుః అత్యంత‌ వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా ఎల్ల‌నూరు మండ‌లం వాసాపురం గ్రామంలో మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌వ‌సాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. త‌ల్లిదండ్రులు సుభ‌ద్ర‌మ్మ‌, చిన్న‌వీరారెడ్డిల ఏకైక సంతానం. క‌ర‌వు ప్రాంతం కావ‌డంతో పేద‌రికాన్ని అనుభ‌వించాను. క‌ష్ట‌న‌ష్టాలు  జీవితంలో భాగ‌మ‌య్యాయి. మా గ్రామంలో చ‌దువుకున్న వారిలో నేనే మొద‌టి జ‌నరేష‌న్. ఎన్ఐటీ  వ‌రంగ‌ల్ లో బీటెక్‌. పాండిచ్చేరి కేంద్రీయ విద్యాల‌యం నుంచి ఎంబీఏ ప‌ట్ట‌భ‌ద్రుడిని. సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేశాను. అందుకు కార‌ణ‌మైన ప‌రిస్థితులు, రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ను ప‌సిగ‌ట్టాను. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ కావ‌డంతో ప్ర‌తి నిర్ణ‌యం రాజ‌కీయ నాయ‌కుల నిర్ణ‌యాల‌తో ముడిప‌డి ఉంద‌ని గ‌మ‌నించాను.  స‌మాజంలోని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే దేశ ప్ర‌గ‌తి నిరోధ‌క శ‌క్తులుగా రాజ‌కీయ నాయ‌కులు త‌యార‌నేది వాస్త‌వం.  ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాలైన విద్య‌, వైద్యం, ఉపాధిని పాల‌కులు విస్మ‌రించారు. వీటిని స‌రిదిద్దాలంటే రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి. రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలంటే అందులో ఉంటేనే సాధ్య‌మ‌ని గుర్తించాను. స‌ర్పంచ్ మొద‌లుకుని ఎమ్మెల్యే, ఎంపీ…ఇలా ఏ ప‌ద‌వైనా.. ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నిక కావాలంటే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సిన వ్య‌వ‌హార‌మైంది. అంటే రాజ‌కీయం డ‌బ్బున్నోళ్లకు సంబంధించిన వ్యాపార‌మైంది. ఇది అంద‌రికీ తెలిసిందే. దీంతో రాజ‌కీయాల‌పై, స‌మాజ పురోగ‌మ‌నంపై నిజంగా అవ‌గాహ‌న‌, ఆస‌క్తి ఉన్న వాళ్లు ధ‌న‌మ‌య‌మైన రంగంలో అడుగు పెట్టేందుకు వెన‌కాడుతున్న నిస్స‌హాయ స్థితి. అవ‌స‌రానికి మించి డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే రంగం ఏదైనా ఉందంటే అది రాజ‌కీయ‌మే. ఈ మొత్తం దుష్ప‌రిణామాల‌ను మార్చాల‌నే సంక‌ల్పం నుంచి జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అనే ఆశ‌యం, ఆలోచ‌న‌లు పుట్టుకొచ్చాయి.
zbp
ప్ర‌శ్నః మ‌నిషికి ఆరో ఇంద్రియం డ‌బ్బు అంటారు. మ‌రి డ‌బ్బు లేనిది ఊపిరి కూడా పీల్చుకోలేని ప‌రిస్థితి. రాజ‌కీయాలు పూర్తిగా డ‌బ్బు మ‌య‌మైన ప‌రిస్థితుల్లో జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అనేది ఊహాజ‌నిత‌మైన భావ‌న కాదా?
జ‌వాబుః మీతో ఏకీభ‌విస్తున్నాను. కానీ ఏమీ లేన‌ప్పుడు డ‌బ్బు ప్ర‌భావం చూపుతుంది. సామాజిక స్పృహ‌, సేవా దృక్ప‌ధం ఉన్న నేత‌లున్న చోట డ‌బ్బు ప్ర‌భావం ఉండ‌ద‌ని గుర్తించ‌వ‌చ్చు. త‌మ‌ను ఎన్నుకున్న‌ ప్ర‌జ‌ల కోసం ,వారి క‌నీస అవ‌స‌రాలైన విద్య‌, ఉద్యోగం, వైద్యం త‌దిత‌ర వాటిని త‌న చుట్టూ ఉన్న వ‌న‌రుల‌ను వినియోగించుకుని తీర్చిన‌ప్పుడు క‌లిగే ఆనందానికి వెల‌క‌ట్ట‌లేం. ఎంత మందికి చేశార‌నేదాని కంటే , ఆ చేసే వ్య‌క్తిలోని నిజాయ‌తీని ప్ర‌జ‌లు ఎప్పుడైనా గుర్తిస్తారు, గౌర‌విస్తారు. అలాంటి నేత ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు డ‌బ్బు గురించి ఆశించ‌రు, ఆలోచించ‌రు.
zbp b1
ప్ర‌శ్నః రాజ‌కీయ రంగ‌మ‌నే కాదు అన్ని వ్య‌వ‌స్థ‌లు,  బంధాలు, అనుబంధాలు ఆర్థికంగా ముడిప‌డి ఉన్నాయి. ఇది విశ్వ వ్యాప్త స‌మ‌స్య‌. డ‌బ్బుకు కాకుండా విలువల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చేయాలంటే స‌మాజంలో ఎలాంటి మార్పు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.
జ‌వాబుః స‌మాజంలో మార్పు రాత్రికి రాత్రి తీసుకురాలేం. విద్యా వ్య‌వ‌స్థ ద్వారా ఆ మార్పు తీసుకురావ‌చ్చు. ఈ విద్యా వ్య‌వ‌స్థ కూడా మ‌ళ్లీ రాజ‌కీయ నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అందువ‌ల్లే రాజ‌కీయాల్లో జీరో బ‌డ్జెట్ ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని ప‌దేప‌దే చెబుతున్నాను. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌లోభాలాకు లోనైతే శాశ్వ‌తంగా మ‌న భ‌విష్య‌త్‌ల‌కు స‌మాధి క‌ట్టుకున్న‌ట్టే. మన జీవితాల్లో డ‌బ్బు సృష్టించ‌లేని ఆనందాన్ని శ్ర‌మ‌, ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకునే సంప్ర‌దాయాలు, సేవ ఇస్తాయ‌ని చైత‌న్యం తీసుకొస్తున్నాం.
zbp 2
ప్ర‌శ్నః  జీరో బ‌డ్డెట్ పాలిటిక్స్‌పై మీ కృషికి ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంది. భ‌విష్య‌త్‌లో మీ క‌ల నెర‌వేరుతుంద‌నుకుంటున్నారా?
జ‌వాబుః చాలా బ్ర‌హ్మాండమైన‌ స్పంద‌న ల‌భిస్తోంది. ఏ ప్ర‌య‌త్న‌మైనా రాత్రికి రాత్రి ఫ‌లితాలు ఇవ్వ‌దు. నిరంతర కృషి జ‌ర‌గాలి. ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంది. స్వ‌తంత్రం వ‌చ్చిన మొద‌ట్లో డ‌బ్బు ప్ర‌భావం త‌క్కువ ఉండేది. ఆ త‌ర్వాత క్ర‌మంగా డ‌బ్బే రాజకీయాలు అనే విధంగా త‌యార‌య్యాయి. దీనికి కార‌ణం…పారిశ్రామిక వేత్త‌లు రాజ‌కీయ రంగంలోకి రావ‌డ‌మే. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అనేది క‌ల కాదు. ఇది నిజం. క‌చ్చితంగా నెర‌వేరుతుంది. ఉత్సాహ వంతులైన యువ‌త ముందుకు వ‌స్తోంది. రాజ‌కీయం అంటే స‌మాజ అభివృద్ధికి త‌ప్పితే స‌మాజ వినాశ‌నానికి కాద‌నే సందేశంతో అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నాం. దీనికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌జాస్వామ్యాన్ని పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు, దోపిడీదారులు క‌బ్జా చేశారు. వారి క‌బంధ హ‌స్తాల నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గాంధీజీ ఎలాగైతే అహింస అనే ఆయుధాన్ని చేబ‌ట్టి దేశాన్ని ఏక‌తాటిపైకి తెచ్చారో…మ‌నం కూడా జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అనే ఆయుధాన్ని త‌ప్ప‌ని స‌రిగా చేత‌ప‌ట్టాల్సిందే. దీనికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేనే లేదు.

6 thoughts on “జీరో బ‌డ్జెట్ పాలిటిక్సే ప్ర‌త్యామ్నాయం-డ‌బ్బు ర‌హిత రాజ‌కీయ ఉద్య‌మ‌కారుడు పోతిరెడ్డి మాధ‌వ‌రెడ్డి

 1. When I originally left a comment I appear to have clicked on the -Notify me when new
  comments are added- checkbox and now whenever a comment is added I get
  4 emails with the same comment. There has to be an easy method
  you are able to remove me from that service? Thanks!

 2. I must thank you for the efforts you have put in penning this site.
  I’m hoping to check out the same high-grade blog posts from you in the
  future as well. In truth, your creative writing abilities has inspired me to get my own, personal site now 😉

 3. I must thank you for the efforts you’ve put in writing this blog.
  I am hoping to check out the same high-grade blog posts by you in the future as well.

  In fact, your creative writing abilities has inspired me to get
  my very own website now 😉

 4. It’s a pity you don’t have a donate button! I’d definitely donate to this excellent blog!

  I guess for now i’ll settle for bookmarking and adding your RSS feed to my
  Google account. I look forward to brand new updates and will talk about this site with my Facebook group.
  Talk soon!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *