minister somiredy

ప్రేమ గుడ్డిద‌ని తెలియ‌దా సోమిరెడ్డి 

గాసిప్స్
ఏంటో…ఆయ‌న మాటేంటో…ఆయ‌న బాధ ఏంటో…ఏమీ అర్థం కాదు. మోడీ, ప‌వ‌న్ ప్రేమించుకుంటున్నార‌ని, వారిద్ద‌రూ ముద్దూమురిపాలు తీర్చుకుంటున్నా త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెబుతున్నారు. ఇబ్బంది లేక‌పోతే వారి ప్రేమ‌గోల మ‌ధ్య‌లో మీన‌సేంది, స‌ణుగుడేంది సామీ అని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు.
‘‘రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ, జగన్‌, పవన్‌… ప్రేమించుకుంటున్నారు. పవన్‌, మోదీ చంకలో కూర్చొని ముద్దులు పెట్టుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 17 అంశాల్లో కేంద్రంపై పోరాటం చేస్తానని పవన్‌ ప్రకటించారు. ఇప్పుడా పోరాటం ఏమైంది? పెట్రో ధరలపై, రాఫెల్‌ కుంభకోణంపై ఎందుకు మాట్లాడటంలేదో పవన్‌ చెప్పాలి. అంతే కాదు ప‌వ‌న్ ప‌ద్ధతులు పాడూ  ప్రజలకు చెప్పాల్సిందే’’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి బుధ‌వారం అమ‌రావ‌తిలో విలేక‌రుల‌తో అన్నారు.
ఇంత కాలం ప‌వ‌న్‌, మోడీతో టీడీపీ సాగించింది ప్రేమాయ‌ణ‌మా, రంకా, కామాయ‌ణ‌మా…ఇందులో ఏది నిజ‌మో సోమిరెడ్డి చెప్పాల్సిన బాధ్య‌త ఉంది. అయినా రాఫెల్ కుంభ‌కోణం, పెట్రో ధ‌ర‌ల‌పై ప‌వ‌న్ మాట్లాడాలా?  మీరింత కాలం రాష్ర్టానికి కేంద్రం, మోడీ ఎంతో అద్భుతంగా చేశారు, ఇంత కంటే ఏ రాష్ర్టానికి చేశారో చూపాల‌ని ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరింది మీ బాబునే క‌దా తండ్రి.
ఇప్పుడు మోడీతో ప్రేమ విచ్ఛిన్న‌మైతే దెయ్యంలా క‌నిపిస్తున్నాడా?   ప్రేమ గుడ్డిదని మీరు ఎప్పుడూ విన‌లేదా?  వాణిశ్రీ‌తో పీక‌ల్లోతూ ప్రేమ‌లో కూరుకుపోయాన‌ని ఈ మ‌ధ్య చెప్పిన‌ట్టు ఉన్నావు. వాణిశ్రీ‌తో ప్రేమ‌లో మునిగిపోయిన‌ప్పుడు ఈ లోకంలో నీకు ఆమె త‌ప్ప మ‌రెవ‌రైనా క‌నిపించారా? అంతేబాబు ప్రేమ మ‌హ‌త్యం. ఏమీ క‌న‌ప‌డ‌దు, ఏమీ విన‌ప‌డ‌దు. అదెలా అంటే మోడీతో మీరు నాలుగేళ్ల పాటు ప్రేమ‌లో కూరుకుపోయిన‌ప్పుడు రాష్ర్టానికి ప్ర‌త్యేక ఇవ్వ‌న‌ది, రాజ‌ధాని, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల‌కు నిధులు ఇవ్వ‌న‌ది క‌నిపించ‌న‌ట్టుగా…అవునా కాదా మంత్రి వ‌ర్యా.
ఒక‌వైపు మోడీతో ప‌వ‌న్ స‌ర‌సాలాడుతున్నాడ‌ని నీవే చెబుతూ, మ‌రోవైపు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వేస్తూ స‌మాధానం అడుగుతావా?   మీలాంటోళ్ల‌ను చూసే ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చి ఎవ‌రో ఎవ‌రి ద‌గ్గ‌రో ప‌డుకుంటో నేను స‌మాధానం చెప్పాలా అని ఇటీవ‌ల‌ బ‌హిరంగ వేదిక‌పై నుంచి ప్ర‌శ్నించ‌డం మ‌ర‌చిపోయిన‌ట్టున్నారు. ఇప్ప‌టికీ నీకు ప‌వ‌న్ స‌మాధానం చెప్పాల్సిందే అంటావా. ఊరుకో సామీ..ఆయ‌న అస‌లే మంచోడు కాదా…నీ గోకుడు య‌వ్వారాలను బ‌య‌ట‌కు తీస్తాడు జాగ్ర‌త్త‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *