ntr baio pic

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

సినిమా
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. దానికి కథానాయకుడు అనే క్యాప్షన్ జత చేశారు. టైటిల్‌ను ఎన్టీఆర్ కథానాయకుడిగా మార్చడాన్ని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. రెండో భాగానికి యన్.టి.ఆర్ ప్రజానాయకుడు అని టైటిట్ పెట్టినట్టు తెలుస్తోంది.
బాలయ్యబాబు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నామని డైరెక్టర్ క్రిష్ తెలిపాడు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9న యన్.టి.ఆర్ కథనాయకుడు’ వస్తున్నాడని క్రిష్ ట్వీట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *