new

రాష్ట్ర సాంస్కృతిక రాయ‌బారిగా లెనిన్‌బాబు

న్యూస్
అమ‌రావ‌తి :  రాష్ట్ర ప్రభుత్వ‌ సాంస్కృతిక రాయ‌బారిగా అనంత‌పురం జిల్లాకు చెందిన ప్రగ‌తిశీల జాన‌ప‌ద‌ గాయ‌కుడు ఎస్‌.కె.లెనిన్‌బాబు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు సాంస్కృతిక శాఖ కార్యద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. నియ‌మితులైన నాటి నుండి రెండేళ్లపాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు. సాంస్కృతిక రాయ‌బారి హోదాలో రెండేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యటించి తెలుగు భాష‌, సంస్కృతి ప్రాశ‌స్త్యంపై యువ‌త‌లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌లిగించ‌డంతో పాటు ప్రభుత్వ ప‌థ‌కాల‌పై ఆయా వ‌ర్గాల్లో త‌న పాట‌ల ద్వారా ప్రచారం చేస్తారు. సాంస్కృతిక రాయ‌బారిగా లెనిన్‌బాబు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడును క‌లిసి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞత‌లు తెలిపారు. రాష్ట్రంలో సాంస్కృతిక వికాసానికి కృషిచేయాల‌ని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఆయ‌న్ను అభినందించారు.  సాంస్కృతిక రాయ‌బారి లెనిన్‌బాబుకు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు కూడా శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి విద్యార్ధుల్లో తెలుగు భాష‌, సంస్కృతిపై అవ‌గాహ‌న క‌లిగించాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *