kcr

ఆంధ్రాలో కేసీఆర్ వేలు, కాలు పెడ‌తాడ‌న్న మాట‌

పొలిటికల్
శ్రీ‌మాన్ చంద్ర‌బాబు గారి అంత‌రంగాన్ని బ‌ట్టి రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రా రాజ‌కీయాల్లో కాలు, వేలు పెడ‌తార‌ని నిర్ధార‌ణ అయ్యింది. ఈ మాట స్వ‌యాన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారే సెల‌విచ్చారు మ‌రి. కేసీఆర్ ఆ ప‌ని చేస్తే బాబుకే మంచిది క‌దా. అర్రె తెలంగాణ రాక్ష‌సి కేసీఆర్ అని అత‌ని తిట్లు అత‌నికే అప్ప‌చెప్పి, ఒప్ప‌చెప్పి జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను గొబ్బు ప‌ట్టించేందుకు చంద్ర‌బాబుకు మంచి ఆయుధం దొరుకుతుంద‌న్న మాట‌.
ఆంధ్రా రాజ‌కీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకోడ‌మంటూ ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌దు. కాని జ‌గ‌న్‌, ప‌వ‌న్ వెనుక మోడీ, కేసీఆర్ ఉన్నారంటూ చంద్ర‌బాబు ప్ర‌చారానికి ఒక స‌రికొత్త అస్ర్తం కావాలి. దాన్ని ఇప్ప‌టి నుంచే త‌న మీడియా ద్వారా బాబు జ‌నంలోకి తీసుకెళ్లేందుకు ఎత్తుగ‌డ వేస్తున్నార‌ని అర్థః చేసుకోవాలి.
కేసీఆర్ ఎలాగైతే బాబును బూచిగా చూపుతూ ప్ర‌చారంలో దూసుకెళుతున్నారో…ఆంధ్రాలో కూడా చంద్ర‌బాబు అదే ర‌క‌మైన సెంటిమెంట్‌ను రేకెత్తించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఎందుకంటే ఈ నాలుగున్న‌రేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథ‌కాన్ని అమ‌లు చేయ‌డం గాని, ఇచ్చిన హామీల‌ను పక్కాగా నెర‌వేర్చిన దాఖ‌లాలు ఏపీలో లేవు. అందుకే  ఇలాంటి ఛీప్ ట్రిక్స్ రాజ‌కీయాల‌కు స్థాయిని మ‌ర‌చి పాల‌కులు తెగ‌బ‌డుతున్నారు. న‌వ్విపోదురుగాక మాకేటి సిగ్గు, మాక్కావాల్సింది అధికార‌మే త‌ప్ప మ‌రోటి కాద‌ని నేత‌లు నిస్సిగ్గుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చూద్దాం ఏమ‌వుతుందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *