rammandir issue

సన్యాసి దీక్ష భ‌గ్నం చేసిన ఉత్త‌ప్ర‌దేశ్ పోలీసులు

న్యూస్

అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మించాల‌ని ఏడురోజులుగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న ఓ స‌న్యాసి దీక్ష‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు భ‌గ్నం చేశారు. స్వామి ప‌ర‌మ‌హాస్ దాస్ అయోధ్య‌లో ఈ దీక్ష చేస్తున్నారు. ఏడు రోజులుగా దీక్ష చేయ‌డంతో ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో అయోధ్య పోలీసులు ఆదివారం రాత్రి ఆయ‌ను బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఉత్త‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మ‌హేష్ మ‌హ‌త్ దీక్ష చేస్తున్న స‌న్యాసిని క‌లిసిన కొద్దిసేప‌టికే దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. అంత‌కు ముందు ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానంద్‌తో ఈ విష‌యంపై స్వ‌యంగా మాట్లాడిస్తాన‌ని, దీఓ విర‌మించాల‌ని కోరారు. రామ‌మందిర నిర్మాణం విష‌యంలో త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతూ సాధువుల సంఘం ఈనెల 6న రాష్ట్రప‌తి కోవిద్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. రామ‌మందిరం నిర్మాణ విష‌యంలో తాము వెన‌క్కు త‌గ్గేది లేద‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *