babu feelings

చంద్ర‌బాబు బావ క‌ళ్లల్లో ఆనందం కోసం…

గాసిప్స్
టీడీపీ అధినేత చంద్ర‌బాబు బావ ఆనందం కోసం ఎల్లోమీడియా ఏమైనా రాస్తారు, ఏమైనా రాయ‌రు అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఎల్లోమీడియా ఓర్వ‌లేనిత‌నం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఎక్క‌డో ఉత్త‌రాధి రాష్ర్టాల‌పై వెలువ‌డిన స‌ర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే స‌మాచారాన్ని ఎల్లో మీడియా ఎంతో అపురూపంగా క‌ళ్ల‌క‌ద్దుకుని మ‌రీ ప్ర‌చురించింది. దీన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు, ప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే త్వ‌ర‌లో ఐదు రాష్ర్టాల‌కు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ‌స్థాయిలో పే…ద్ద రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు దారి తీస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అందుకే ఉత్త‌రాధి రాష్ర్టాలైన‌ప్ప‌టికీ అక్క‌డి ఫ‌లితాల‌పై యావ‌త్ దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. 

vote ఏబీపీ న్యూస్‌-సీ ఓటరు సర్వే ప్ర‌కారం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు… రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ తిరిగి గెలవడం కష్టమ‌ని తేల్చింది. అలాగే  సీ ఫోర్‌ మాత్రం ఒక్క రాజస్థాన్‌లోనే సర్వే చేసింది. ఆ స‌ర్వేలో కూడా బీజేపీకి ప్ర‌తికూల ఫ‌లిత‌మే వెలువ‌డింది.  15 ఏళ్లుగా   మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీని మ‌ట్టిక‌రిపించి కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌డుతార‌ని స‌ర్వేలో తేలింది. 
 

ఇటీవ‌ల ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా , సీ-ఓట‌రు స‌ర్వే సంస్థ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టేందుకు స‌ర్వేలు నిర్వ‌హించాయి. ఈ స‌ర్వే ఫ‌లితాలు ఎల్లోమీడియా య‌జ‌మానులు ఆరాధ్య దైవం చంద్ర‌బాబు పార్టీ టీడీపీకి ప్ర‌తికూల ఫ‌లితాలు రావ‌డంతో కిక్కుర‌మ‌నకుండా ఉండిపోయింది. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వ‌హించిన స‌ర్వేలో   ఏపీ సీఎంగా జ‌గ‌న్‌కు 43 శాతం, చంద్ర‌బాబుకు 38, ప‌వ‌న్‌కు 5 శాతం ఓట్లు వ‌చ్చాయి. అలాగే సీ ఓట‌ర్ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా ఏపీలో ఇప్ప‌టిక‌ప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే 25 స్థానాల‌కు గాను 21 చోట్ల వైసీపీ, 4 సీట్ల‌ను టీడీపీ గెలుచుకొంటుంద‌ని తేలింది.  అంతేగాకుండా . వైఎస్సార్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 
flags
ఈ సర్వేల స‌మాచారం బూత‌ద్దం ప‌ట్టుకుని చూసినా ఎల్లోమీడియాలో క‌నిపించ‌లేదు. కాని ఉత్త‌రాధిన కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే తీపి క‌బురు కంటే బీజేపీ ప‌త‌న దిశ‌లో ప‌య‌నిస్తుంద‌నే స‌మాచార‌మే ఎల్లోమీడియాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్న‌ట్టుగా అర్థం చేసుకోవాలి. ఎంతైనా చంద్ర‌బాబు బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఏమైనా రాస్తారు, ఏమైనా రాయ‌రు క‌దా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *