devineni uma

జ‌గ‌న్ కేసీఆర్ భాష మాట్లాడితే ఓకేనా ఉమా?

పొలిటికల్
దేనికైనా దెబ్బే గురువంటారు. పాపం మంత్రి దేవినేని ఉమకు జ‌గ‌న్ మాట‌లు న‌చ్చ‌డం లేదంటా? త‌న స‌భ‌లోకి 108 వాహనం వ‌చ్చిన‌ప్పుడు బాబు వికృత‌చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. మొత్తానికి ఈ వాహ‌నాల గొడ‌వ చంద్ర‌బాబు స‌ర్కార్‌ను చావు దెబ్బ‌తీయ‌డంతో గిల‌గిలా త‌న్నుకు చ‌స్తున్నారు. ఏయ్ ఆ 108 వాహ‌న ర‌హ‌స్యాన్ని నేను ఛేదించానంటూ మంత్రి దేవినేని సోమ‌వారం విలేక‌రుల ముందుకు వ‌చ్చాడు.
 ఓ వైసీపీ కార్యకర్తకు దెబ్బతగిలితే ఆ పార్టీ కార్యకర్తలే అంబులెన్స్ పంపించాలంటూ ఫోన్‌ చేశారని మంత్రి తేల్చి చెప్పారు. మీరే ర‌ప్పించుకుని మ‌మ్మ‌ల్ని గొబ్బు ప‌ట్టిస్తారా అని మంత్రి చిట‌ప‌ట‌లాడాడు.  108 అంబులెన్స్‌ వస్తే ప్రభుత్వమే పంపించిందంటావా? అని నిగ్గ‌దీసి జ‌గ‌న్‌ను మంత్రి గారు అడిగేశాడు, క‌డిగేశాడు. అస‌లు జ‌గ‌న్ ఆ వికృత భాష ఏంటి అని ఉమ తెగ బాధ‌ప‌డుతూ ప్ర‌శ్నించాడు. మ‌రి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబును ఏమ‌న్నారో మంత్రిగారు విన్న‌ట్టు లేదు పాపం. ఒక వేళ వింటేగింటే ఆయ‌న ప్రాణం ఏమ‌వుతుందో? ఆంధ్రా రాక్ష‌సి, థూ..మోస‌కారి, న‌య‌వంచ‌కుడు, బొడ్డులో క‌త్తి పెట్టుకుని తిరుగుతున్న తెలంగాణ ద్రోహి అని మ‌న‌కు అర్థం కాని, డిక్ష‌న‌రీలో కూడా క‌నిపించ‌ని తిట్ల దండ‌ను బాబు మెడ‌లో కేసీఆర్ ప్రేమ‌గా వేశాడు.
కేసీఆర్ తిట్ల‌తో పోల్చుకుంటే జ‌గ‌న్ వాడిన వికృత మాట ఏ పాటిది? అవున్లే న‌చ్చిన వాళ్లు తిట్టినా, కొట్టినా దేవుడు చేసిన‌ట్టు ఉంటాద‌ని పెద్దలు ఊరికే చెప్ప‌లేదు క‌దా? అయ్యా జ‌గ‌న్ బాబు కాస్త తెలంగాణ‌కు వెళ్లి, ఆ కేసీఆర్ ద‌గ్గ‌ర ఎలా మాట్లాడాలో శిక్ష‌ణ పొంద‌కూడ‌దా? ఈ ఎన్నిక‌ల‌కు ఏమైనా వ‌ర్క‌వుట్ అవుతుందేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *