NTR TDPki dorikena

టీడీపీ ప్రచార బుట్టలో బుడ్డోడు ప‌డతాడా?

పొలిటికల్

అర‌వింద స‌మేత‌.. సినిమా వేడుక‌.. నంద‌మూరి అభిమానుల‌కు క‌నుల‌పంట‌. అదే స‌మ‌యంలో ఎన్నో ప్రశ్న‌లకు వేదిక‌. అదెలా అంటారా.. దీనికి చాలా కార‌ణాలున్నాయి. నంద‌మూరి వ‌ర్సెస్ నారా మ‌ధ్య న‌లిగిన ఎన్‌టీఆర్ వార‌సుల్లో పెద్ద ఎన్‌టీఆర్‌, హ‌రికృష్ణ కాగా.. మూడో వ్యక్తి జూనియ‌ర్‌. ఇది జీర్ణించుకునేందుకు ఇబ్బందిగా అనిపించినా రాజ‌కీయ వాస్తవం. నంద‌మూరి తార‌క‌రామారావు న‌టుడిగా, సీఎంగా ఎంత ఉన్నతంగా బ‌తికారో.. చివ‌రి రోజుల్లో అంత‌టి న‌ర‌కం చ‌విచూశారు.

దీనికికార‌ణం లక్ష్మిపార్వతీ అంటూ విమ‌ర్శలు చేసినా. ఏడు ప‌దుల వ‌య‌సులో తోడులేకుండా క‌న్నబిడ్డల ఆద‌ర‌ణ‌కు దూర‌మై వృద్ధుడు ఎలా ఉండ‌గ‌ల‌డు. ఆయ‌న కూడా అదే ఆలోచించారు. దానికి ఇదేదో ఘోర‌మైన అప‌రాధంగా.. వెలివేసినంత ప‌నిచేశారు. ఒకానొక స‌మ‌యంలో మాజీ మంత్రి చిన్నమ్మ అదేనండి ద‌గ్గుబాటి పురందేశ్వరి.. ఏమ్మా. నువ్వు కూడా ఇలా చేస్తావా అంటూ నాన్న అడిగిన ప్రశ్న జీవితంలో మ‌ర‌చిపోలేనిదంటూ ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు.

ఆ త‌ర్వాత‌ హ‌రికృష్ణ‌.. నాన్న ప్రచార ర‌థసార‌థిగా కార్యక‌ర్తల‌కు చేరువ‌య్యారు. న‌ల‌బై ఏళ్ల వ‌య‌సులో హీరోగా అల‌రించారు. కానీ.. రాజ‌కీయంగా ముక్కుసూటిత‌నం.. నిజాయ‌తీ ఆయ‌న్ను ఓడించాయి. బావ బ‌తుకు కోరి.. బావ‌మ‌రిది ప‌క్కకు జ‌రిగారు. ఆ చోట్లోకి వెళ్లిన జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ను 2009 ఎన్నిక‌ల్లో ఫుల్‌గా ప్రచారానికి వాడేశారు.

బుడ్డోడు య‌మా గ‌ట్టోడు అంటూ నేత‌లు.. అబిమానులు బ్రహ్మర‌థం ప‌ట్టారు. క‌ట్ చేస్తే జూనియ‌ర్ పెళ్లి.. పిల్లలు.. సినిమాల ప్లాపులు.. ఇటువంటి వేళ అయిన వారి చీద‌రింపులు. అన్నీభ‌రిస్తూ త‌న‌కు తాను మార్చుకున్నాడు. అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లాడు. ఎదురుదెబ్బలు తిన్నచోటే హిట్స్ అందుకున్నాడు.

అంతే.. మ‌ళ్లీ జూనియ‌ర్ గుర్తుకువ‌చ్చాడు. తాను మాత్రం టీడీపీ న‌మ్మిన‌బంటునే అంటూ చెప్పుకొచ్చారు. త‌న ర‌క్తంలో తాత‌గారు ఉన్నారంటూ.. పార్టీకి అవ‌స‌ర‌మైన వేళ త‌ప్పకుండా వ‌స్తానంటూనే ఉన్నారు. కానీ. ఇంత‌లో తండ్రి మ‌ర‌ణం. ఎన్నిక‌ల స‌మ‌యం.. దీంతో అంద‌రూ క‌లిశారు. అది మంచిదే కానీ దానిలోనూ ఓటుబ్యాంకు రాజ‌కీయం అనే విమ‌ర్శలు త‌ప్పలేదు.

ఇప్పుడు అర‌వింద‌స‌మేత సినిమా హిట్‌. తార‌క్ మ‌రోసారి తారాప‌థంలా దూసుకెళ్లారు. పండుగ వాతావ‌ర‌ణంలో వేడుక‌.. దానికి ముఖ్య అతిథి బాల‌య్య‌.. సారీ.. చంద్రబాబు వియ్యంకుడు. ఆయ‌న ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌తో 2019లో టీడీపీని గ‌ట్టెక్కించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. సారీ.. బాల‌య్యతో కంక‌ణం క‌ట్టించారు.

ఏమైనా.. మ‌ళ్లీ రాజ‌కీయాలు. ఎన్టీఆర్ కుటుంబం ఏక‌మైంది. దీనివ‌ల్ల కొత్తగా వారికి వచ్చే లాభంలేదు. లాభ‌ప‌డేది ఎవ‌ర‌నేది కూడా అంద‌రికీ తెలుసు. అయితే.. ఇప్పుడు కీల‌క‌మైన అంశం.. జూనియ‌ర్ క‌రిగిపోయాడా.. బాల‌య్య చూపిన అబిమానం కొడుకుగా ఓకే అనుకున్నాడా!

దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకుని తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో జూనియ‌ర్‌ను వాడుకుంటారా. లేదా ప్రచార సార‌ధిగా టీడీపీని న‌డిపించ‌మంటారా.. దీనికి తార‌క్ ఒప్పుకుంటాడా! తాత‌.. నాన్నల మ‌ర‌ణాన్ని రాజ‌కీయాల‌కు ఉప‌యోగించుకుంటున్న వారి నిజ‌రూపాన్ని సున్నితంగా తిర‌స్కరిస్తాడా! ఏమోకాలం చెప్పాల్సిన స‌మాధానాలివి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *