mataku tuta

మాట‌కు తూట‌

మాటకు తూటా

-జిఆర్ మ‌హ‌ర్షి

మాటః మా పాల‌న‌పై ప్రజ‌ల్లో 76 శాతం సంతృప్తి ఉందిః బాబు
తూటః మీకు “ప‌ర్సెంటేజి” లెక్కలు బాగా తెల్సు.

మాటః మోదీది ఫ్యాక్షన్ మ‌న‌స్తత్వం-జేసీ
తూటః ఆయ‌న‌ది ఫ్యాక్షన్‌, మీది ఓవ‌రాక్షన్‌

మాటః గ‌వ‌ర్నర్‌కి ప‌వ‌న్ నివేదిక‌
తూటః వేదిక‌లు, నివేదిక‌లు కాకుండా ఇంకేం చేయ‌రా మీరు?

మాటః అమ‌రావ‌తిలో తొమ్మిది న‌గ‌రాల‌ను అభివృద్ధి చేస్తాం-బాబు
తూటః ఐదేళ్ల నుంచి అమ‌రా”అతి” విన‌లేక పోతున్నాం

మాటః క‌డ‌ప ఉక్కు కోసం పోరాడినందుకే సీఎం ర‌మేష్‌పై కుట్రః సోమిరెడ్డి
తూటః ద్యేవుడా ఎందుకీ తుక్కు మాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *