HUSHAARU movie

‘హుషారు’గా దూసుకొస్తోంది…

సినిమా

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెంవేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థ తొమ్మిదో చిత్రంగా ‘హుషారు’ తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం.

‘అర్జున్ రెడ్డి’ తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్, ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేశారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 16న విడుదలకి సిద్ధమైంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ త‌మ బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా ఇద‌న్నారు.

కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా, ట్రెండీగా ఉంటాయ‌న్నారు. దర్శకుడు శ్రీహర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కించాడ‌న్నారు.. షూటింగ్ పార్ట్ పూర్తయింద‌న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంద‌న్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీద విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్‌కు విశేష ఆదరణ లభిస్తోంద‌న్నారు.

కాగా ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ : వీణా రాణి , అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : లక్ష్మినారాయణ , లింగా శ్రీనివాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *