dev Movie

దేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్

సినిమా

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *