chandrababunaidu

అబ్బో పోరాటవీరుడు వచ్చాడండీ బాబు?

పొలిటికల్

అబ్బబ్బ‌… చంద్రబాబు గారి ఎంత గొప్ప నిర్ణయం. ఆయ‌న సాహ‌సం గురించి ఏమ‌ని చెప్పను, ఏమ‌ని పొగ‌డ్తలు కురిపించాలో అర్థం కావ‌డం లేదు. ఇంత వ‌ర‌కూ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని నిర‌సిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా ధ‌ర్మపోరాట దీక్షలు, స‌భ‌లు నిర్వహిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చేయాల‌ని నిర్ణయించ‌డం గురించి ఎంత ప్రశంసించినా త‌క్కువే. దేశంలో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో ధ‌ర్మపోరాట స‌భ‌లు నిర్వహించాల‌ని నిర్ణయించ‌డం బ‌హుశా దేశ చ‌రిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందేమో. తెలుగు వాడి దెబ్బంటే మోడీ అబ్బా అనేలా చేయ‌డం ఒక్క మ‌న చంద్రబాబుకే తెలిసిన విద్య‌.

చంద్రబాబు పోరాట స్ఫూర్తి, దేశభ‌క్తిని చూస్తుంటే మ‌హానుభావుడు అల్లూరి సీతారామ‌రాజు గుర్తుకొస్తున్నారు. చంద్రబాబు రూపంలో అల్లూరి సీతారామరాజే మ‌ళ్లీ పుట్టారేమోన‌నే అనుమానం కూడా క‌లుగుతోంది. అల్లూరి సీతారామ‌రాజు పేరు వింటే చాలు దేశ‌భ‌క్తి భావ‌న మ‌న‌సంతా ఉప్పొంగుతోంది. ఇప్పుడు చంద్రబాబు పేరు వింటే తెల్లవాళ్ల స్థానంలో మోడీ, ఆయ‌న ప‌రివారం క‌ళ్ల ముందు క‌ద‌లాడి ఆవేశంతో వెంట్రుక‌లు నిక్క బొడుచుకుంటున్నాయి.

ఈ సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలోని ఓ పాట‌ను గుర్తు తెచ్చుకొందాం. తెలుగు వీర లేవ‌రా, దీక్షబూని సాగ‌రా. చంద్రబాబ‌న్నా పిలుపునందుకొని దేశ‌మాత స్వేచ్ఛకోరి మోడీపై తిరుగుబాటు చేయ‌రా. ఓహో.. దారుణ‌మార‌ణ కాండ‌కు త‌ల్లడిల్ల వ‌ద్దరా… నీతిలేని మోడీ శాస‌నాలు నేటి నుంచి ర‌ద్దురా. నిదుర వ‌ద్దు, బెద‌ర వ‌ద్దు,. నింగి నీకు హ‌ద్దురా. ఎవ‌డు వాడు, ఎచ‌డి వాడు.. ఆ గుర‌జాత్ నాయ‌కుడు ఇటు వ‌చ్చిన న‌ల్లవాడు. కండ బ‌లం కొండ బ‌లం క‌బ‌లించే దుండ‌గీడు. త‌గిన శాస్తి చేయ‌రా, త‌రిమి త‌రిమి కొట్టరా.

ఈ తెలుగుదేశం ఈ ఆంధ్రప్రదేశ్‌ నాదేన‌ని చాటించి. ప్రతి మ‌నిషి తొడ‌లుకొట్టి శృంక‌లాలు ప‌గుల‌కొట్టి… కోడి క‌త్తులకు ప‌దును పెట్టి ప్రత్యర్థుల‌పై దాడులతో తుది స‌మ‌రం మొద‌లుపెట్టి.. సింహాలై గ‌ర్జించాలి. ప్రతిప‌క్ష నేత‌ల‌ సంహారం సాగించాలి. స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య బాలుడా చంద్రబాబునాయుడా… అందుకో మా పూజ‌లందుకో రాజా… ఈ ఆంధ్రప్రదేశ్‌లో పంచ‌భూతాల‌ను కూడా మిగ‌ల‌కుండా చేసిన దేశ భ‌క్తుడా..

చంద్రబాబునాయుడా. నాలుగున్నరేళ్లు మోడీ చేతుల్లో నిదురించిన వాడా… రాష్ర్ట ప్రయోజ‌నాల‌ను కేంద్రానికి తాక‌ట్టు పెట్టిన న‌యా బానిసా… ఇంకా నీ మాట‌లు న‌మ్మి ఎవ‌రి కోసం త్యాగాలు చేయాలి.. క‌ష్టాల‌ను మోయాలి. నిశ్చయంగా, నిర్భయంగా నీ అంతు తేల్చేందుకే నీ వెంట ప‌డుతాం.. త‌స్మాత్ జాగ్రత్త.

‘కాలం మారుతోంది.. అన్ని సమయాల్లో దౌర్జన్యం నడవదు.. ప్రకృతి అన్నిటినీ సమతుల్యం చేస్తుంది.. అంతిమంగా ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది.. అప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా వెనకడుగు వేయకుండా పోరాడాలి’ అని చంద్రబాబు టీడీపీ అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు ఆయ‌న సొంత ప‌త్రిక‌లో రాశారు.

ఇవే అంశాల‌ను త‌న‌కు వ‌ర్తింప‌జేసుకుంటే మంచిది. ఎందుకంటే అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు ఇష్టానుసారంగా పాల‌న సాగిస్తూ…అధికారం శాశ్వత‌మైన‌ట్టు చంద్రబాబు స‌హా టీడీపీ నేత‌లు చెల‌రేగిపోతున్నారు. ఇప్పుడు ఏదో ర‌కంగా ప్రజా వ్యతిరేక‌త నుంచి త‌ప్పించుకునేందుకు, త‌న ఫెయిల్యూర్స్‌ను ఇత‌రుల‌పై నెట్టి, తాను మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చంద్రబాబు క‌ల‌లు కంటున్నాడు.

చంద్రబాబు చెబుతున్నట్టు… కాలం మారుతోంది. అన్ని స‌మ‌యాల్లో వంచ‌న చెల్లుబాటు కాదు. వ్యక్తుల కంటే ప్రకృతి శ‌క్తిమంత‌మైన‌ది. అంతిమంగా ప్రజ‌లు కోరుకుంటున్నది బాబును ఇంటికి సాగ‌నంప‌డ‌మే. ఒక‌వైపు ప్రతిప‌క్ష పార్టీల నేత‌ల‌పై మాన‌సిక‌, భౌతికదాడుల‌కు పాల్పడుతూ, మ‌రోవైపు త‌న‌పై కేంద్రం దాడులు చేస్తోంద‌ని మొస‌లి క‌న్నీరు కార్చడం విప‌రీత మ‌న‌స్తత్వానికి నిద‌ర్శనం.

ఇక త‌న ప‌ప్పులు ఉడ‌క‌వ‌నే తెలిసే… దేశవ్యాప్తంగా ధ‌ర్మపోరాట దీక్షలంటూ స‌రికొత్త నాట‌కాల‌కు తెర‌లేపుతున్నారు. వినాశ‌కాలే విప‌రీత‌బుద్ధి అంటే… బ‌హుశా ఇలాంటివేనేమో.

 

dharmaporatam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *