kcr-harishrao

కేసీఆర్‌కు ఓట‌మి భ‌యం

పొలిటికల్

గజ్వేల్ నుంచి హరీష్… సిద్ధిపేట నుంచి కేసీఆర్
గ‌జ్వేల్ లో కాంగ్రెస్ ఇస్తున్న వ‌రుస షాక్ ల‌తో టెన్షన్ లో ఉన్న కేసీఆర్ తాజాగా మ‌రో ఎత్తుగ‌డ వేశారు. సీఎంగా చేసిన వ్యక్తి స్థానంలో సీఎం ఓడితే… ఎంత మైనస్సో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా కేసీఆర్ కే బాగా తెలుసు. అందుకే కొంత‌కాలంగా ఫాంహౌజ్ లో మంత‌నాలు చేసిన కేసీఆర్, ఓ నిర్ణయానికి వ‌చ్చేశారు. కాంగ్రెస్ ను నిలువ‌రించాలంటే త‌ప్పద‌ని డిసైడ్ అయ్యారు. ప్రత్యర్ధులుగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు చేతులు క‌ల‌పటంతో గ‌జ్వేల్ లో కేసీఆర్ ఓట‌మి ఖాయమ‌నే ప్రచారం విస్తృతంగా జ‌రుగుతోంది.

కేసీఆర్ గెలిచిన నాటి నుండి, ఇంత‌వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ స‌మస్యలు… ఆయా గ్రామాల్లో మంచి చెడ్డా చూసుకున్న ప‌రిస్థితి లేదు. ఇతర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలను నేరుగా క‌లిస్తే, చిన్న చిన్న ప‌నులు నిమిషాల్లో అవుతున్నాయి. కానీ గజ్వేల్ ప‌రిస్థితి వేరు. దీంతో చాలా గ్రామాల్లో ప్రజ‌లు… అభివృద్ధి దేవుడెరుగు, నాకు కావాల్సిన ప‌ని ఎన్ని నెల‌లు అయినా కావ‌టం లేదు, ప్రతాప్ అన్న గెలిస్తే.. న‌ర్సారెడ్డి-ప్రతాప‌న్నలు మాకు అండ‌గా ఉంట‌రు అని జ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

దీంతో గజ్వేల్ గ‌త 10 రోజులుగా మ‌కాంవేసి, మ‌రీ ప్రచారం చేస్తున్న హ‌రీష్ కు విష‌యం అర్థమ‌యింది. సీఎంతో నేరుగా గెలుపు క‌ష్టమేన‌ని చెప్పేశాడు. దీంతో వ్యూహ‌ర‌చ‌న చేసిన కేసీఆర్, తనకు దాదాపుగా ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌ని అందుకే తాను మ‌ళ్లీ త‌న‌కు రాజ‌కీయ జ‌న్మనిచ్చిన సిద్ధిపేట‌కు మారుతాన‌ని, హ‌రీష్ ను గజ్వేల్ బ‌రిలో ఉండు అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. సిద్ధిపేట‌ను విడ‌వ‌లేక‌, గ‌జ్వేల్ కు రాలేక హ‌రీష్ మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని స్థానిక నాయ‌కులంటున్నారు.

కానీ చేసేదేమీ లేక‌పోవ‌టంతో… గ‌జ్వేల్ బ‌రిలో నిలిచేందుకు హ‌రీష్ మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవ‌ల హైద‌రాబాద్ కు కీల‌క‌మైన స్థానిక నేత‌ల‌ను పిలిపించుకొని… మంత‌నాలు చేసిన హ‌రీష్, తాను గ‌జ్వేల్ నుండి బ‌రిలో ఉంటాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మామ అల్లుళ్ల కుండ‌మార్పిడిపై జ‌నం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మంచి రాజ‌కీయ వ్యూహ‌ర‌చ‌న చేసే వ్యక్తిగా పేరున్న ట్రబుల్ షూట‌ర్ హ‌రీష్ రావు.. రంగంలోకి దిగ‌టంతో, గ‌జ్వేల్ రాజ‌కీయం రంజుగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *