ధర్నా చౌక్ లో వీహెచ్ నిరసన

న్యూస్ పొలిటికల్

రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ధర్నాచౌక్ శుక్రవారం నిరసన చేపట్టారు. ధర్నాచౌక్లో ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టరాదంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు హైకోర్టు కొట్టివేసిన తరువాత విహెచ్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరిగింది. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఒకలా మాట్లాడిన సీఎం కేసీఆర్, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ వంటి సిఎంను తాను ఇప్పటి వరకూ చూడలేదని ఆయన చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మహాకూటమేనని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని వీహెచ్ హెచ్చరించారు. కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎవ్వరికీ నష్టం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. రాఫెల్ డీల్లో 30 వేల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తని ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *