chandrababu

బాబు అప్రజాస్వామిక పాల‌నా పాడెను మోసేందుకు న‌లుగురు కావాలి

పొలిటికల్

2014 సార్వత్రిక ఎన్నిక‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు చావోరేవో. ఎలాగైనా అధికారంలోకి రావాలి. అప్పటికే అధికారానికి చంద్రబాబును ప్రజ‌లు ప‌దేళ్లు దూరంగా పెట్టి త‌గిన బుద్ధి చెప్పారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్యమం రాష్ర్ట విభ‌జ‌న‌కు దారి తీసింది. కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ పాల‌న‌తో దేశవ్యాప్తంగా జ‌నం విసిగిపోయి ఉన్నారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రజ‌ల మ‌న‌సు మ‌ళ్లింది. చాయ్‌వాలా ప్రధాని అయితే దేశ భ‌విష్యత్ ఉజ్వలమ‌వుతుంద‌ని జ‌నం న‌మ్మి బీజేపీకి ప‌ట్టంక‌ట్టారు. జ‌నం నాడిని ప‌సిగ‌ట్టిన చంద్రబాబు బీజేపీ బాట‌లో న‌డ‌వ‌డంతో అధికారం ద‌క్కింది.

రాష్ర్టానికి ద‌క్కాల్సిన ప్రత్యేకహోదాకు బ‌దులుగా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకుని ఏపీ ఆకాంక్షకు చ‌ర‌మ‌గీతం పాడారు. అలాగే రైతుల రుణ‌మాఫీకి అతీగ‌తీ లేదు. ఇంకా రెండు విడ‌త‌ల సొమ్ము రైతుల అకౌంట్లలోకి జ‌మ కాలేదు. జాబు రావాలంటే బాబు రావాల‌నే నినాదంతో నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టాడు. బాబైతే అధికారంలోకి వ‌చ్చాడు. కాని నిరుద్యోగుల‌కు ఉద్యోగం రాలేదు. ఆయ‌న బాబుకు మాత్రం మంత్రి ఉద్యోగం ద‌క్కింది. నిరుద్యోగ భృతి నాలుగున్నరేళ్లపాటు ఊసేలేదు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు నెల‌కు వెయ్యి రూపాయ‌లు చొప్పున అదీ 12 ల‌క్షల మందికి ఇచ్చేందుకు బాబు ముందుకొచ్చారు.

కాపుల రిజ‌ర్వేష‌న్ అట‌కెక్కింది. పోల‌వ‌రం నిర్మాణంలో అంతులేని జాప్యం. ముడుపుల కోసం ప‌ట్టిసీమ నిర్మాణం. ఇసుక‌, మ‌ట్టిని య‌ధేచ్ఛగా త‌ర‌లిస్తూ, అడ్డొచ్చిన అధికారుల‌ను మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా భౌతిక దాడులు. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం. ఐదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల రోద‌న అర‌ణ్య రోద‌న‌గానే మిగిలింది. అంతేకాకుండా అగ్రిగోల్డ్‌కు సంబంధించి హాయ్‌ల్యాండ్ ఆస్తిని పాల‌కులు కొల్లగొట్టేందుకు స‌రికొత్త ఎత్తుగ‌డ‌.

రాజ‌ధాని నిర్మాణం పేరుతో మూడు పంట‌లు పండే 33 వేల ఎక‌రాల‌ను బ‌ల‌వంతంగా రైతుల నుంచి లాక్కోవ‌డం… ఇవ్వమ‌ని చెప్పిన రైతుల‌కు త‌ప్పని వేదింపులు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవ‌రినీ క‌దిలించినా క‌న్నీటి వేద‌న‌లే. బాబు అప్రజాస్వామిక పాల‌నకు పాడె సిద్ధమైంది. దాన్ని శ్మశానానికి సాగ‌నంపేందుకు ఓ న‌లుగురు కావాలి. కాని చంద్రబాబు మాత్రం తాను తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఆ నాలుగు పార్టీలంటూ బీజేపీ, టీఆర్ ఎస్‌, వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను దోషులుగా చూపే ప్రయ‌త్నం. ఈ పార్టీల అధినేత‌లు త‌న‌పై కుట్ర చేస్తున్నారంటూ ప్రజ‌ల్లో సానుభూతి పొంది అధికారాన్నిహ‌స్తగ‌తం చేసుకునే ఎత్తుగ‌డ‌.

రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభ‌జించార‌ని కాంగ్రెస్‌ను, సోనియాను తిట్టని తిట్టు తిట్టి… అప్పట్లో అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు… ఇప్పుడు ఆ తెలివి తేట‌ల‌ను మోడీని తిట్టేందుకు ప్రయోగిస్తున్నారు. మోడీ నియంతృత్వం స‌రే… మ‌రి బాబు సంగ‌తేంటి? ఫిరాయింపుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నిలిచిన బాబు పాల‌న‌కు పాడె మోసేందుకు కావాలి మ‌రి ఓ న‌లుగురు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *