babu-family

ఏపీనే నారా ఆస్తి క‌దా?

న్యూస్

ఏమిటో… లోకేశ్ బాబు స‌మ‌యాన్ని వృథా చేస్తుంటాడు. ఇప్పుడు ఎవ‌ర‌డిగారు… చంద్రబాబు ఆస్తిపాస్తుల లెక్కాచారాల గురించి. ప్చ్‌… బాబు ఎంత పేద‌వారో క‌దా? బాబు మొత్తం ఆస్తుల విలువ కేవ‌లం రూ.88.68 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టిన మ‌న‌వ‌డికంటే బాబుగారి ఆస్తులే త‌క్కువ మ‌రి. క‌నీస ఆస్తిపాస్తుల‌ను సంపాదించుకోని బాబును చూస్తే ఎవ‌రికైనా జాలిక‌ల‌గ‌క మాన‌దు. పాపం త‌న ఏలుబ‌డిలో జ‌న్మభూమి క‌మిటీ స‌భ్యుడు కూడా ఇంత త‌క్కువ ఆస్తులు క‌లిగి ఉండ‌డ‌ని బాబుకు తెలిస్తే అస‌లు త‌ట్టుకోలేడు.

ఇంత త‌క్కువ ఆస్తులున్నా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల‌ను కోట్లాది రూపాయ‌లు పెట్టికొన‌గ‌ల‌డు. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు కోట్లు ఇవ్వగ‌ల‌డు. ఈ నాలుగున్నరేళ్లలో రూ.6 వేల కోట్లను కేవ‌లం సొంత ఆర్భాటానికి ఖ‌ర్చు చేయ‌గ‌ల‌డు.

విజ‌య‌వాడ‌లో క‌ర‌క‌ట్టపై తానొక్కడే నివాసం ఉండేందుకు కోట్లాది రూపాయ‌ల అద్దె భ‌వ‌నంలో ఉండ‌గ‌ల‌డు. ధ‌ర్మదీక్షల‌కు లెక్కంటే లెక్క లేకుండా కోట్లాది రూపాయ‌ల‌తో నిర్వహించ‌గ‌ల‌డు. ఆర్థికమంత్రి పంటి వైద్యానికి విదేశాల్లో ల‌క్షలాది రూపాయ‌ల‌తో వైద్యం చేయించ‌గ‌ల‌డు.

త‌న తోక ప‌త్రిక‌లో పెయిడ్ న్యూస్‌కు రూ.700 కోట్లు ఇవ్వనూ గ‌ల‌డు. అలాగే ప్రచార ఆర్భాటాల‌కు వేలాది కోట్లను ఖ‌ర్చు చేయ‌గ‌ల‌డు. లోటు బ‌డ్జెట్ అంటూనే పుష్కరాల‌కు ఐదు వేల కోట్లను ఖ‌ర్చుచేసి పుణ్యాన్ని సంపాదించుకోగ‌ల‌డు.

ఇలా ఒకటా రెండా… ఎన్నెని.. ఎన్నెన్ని మ‌న బీద సీఎం గారి గొప్పద‌నం గురించి చెప్పాలి. అయ్యా మీ అబ్బాయి లోకేశ్‌కు తెలియ‌క ఆస్తుల గురించి వెల్లడించిన‌ట్టున్నారు. ఈ ఆంధ్రప్రదేశే మీ అబ్బ‌, మీ, మీ కొడుకు, మ‌న‌వ‌డి సొత్తు క‌దా? లేక‌పోతే ప‌ట్టుమ‌ని రెండువంద‌ల కోట్ల ఆసామి కూడా కాని మీరు… వేలాది కోట్లను అప్పనంగా ఎలా ఖ‌ర్చుపెట్టారు? పెడుతున్నారో స‌మాధానం చెప్పరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *