jagapathi-ysr-yatra

వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జ‌గ‌ప‌తిబాబు

సినిమా

డాక్టర్ వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్రలో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న చిత్రం యాత్ర‌. వైఎస్సార్‌ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలకఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముటి వైఎస్ పాత్రలో ప‌ర‌కాయ ప్రవేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శకుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్రని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్పటికే విడుద‌ల చేసిన ప్రమోష‌న్ మెటీరియ‌ల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డాక్టర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రలో జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. ఈ రోజు వైఎస్‌ రాజారెడ్డి లుక్ విడ‌ద‌ల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ మ‌హానాయకుడు ఈ యాత్ర‌. చాలావ‌ర‌కు రియ‌లిస్టిక్ గా చూపించ‌టానికి ద‌ర్శకుడు మ‌హి ప్రయ‌త్నించారన్నారు. వైఎస్సార్‌ పాత్రలో మమ్ము‌టి అద్భుతంగా న‌టించార‌న్నారు. ఆయ‌నే తెలుగులో డ‌బ్బింగ్ చెప్పటం విశేషమ‌న్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించామ‌న్నారు.

ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంద‌న్నారు. వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జ‌గ‌ప‌తిబాబు న‌టించారన్నారు. పాత్ర చిన్నదైనా చాలా ముఖ్యపాత్ర కావ‌టంతో మేము అడిగిన వెంట‌నే అంగీక‌రించిన జ‌గ‌ప‌తిబాబుకి ధ‌న్యవాదాల‌న్నారు.

తెలుగు ప్రజ‌లంద‌రూ త‌ప్పకుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నామ‌న్నారు. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 8న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విడుద‌ల చేస్తామన్నారు.

నటీ నటులుః మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *