nani-jersy

షూటింగ్‌లో నాని ముక్కుకు తీవ్ర గాయం

గాసిప్స్ సినిమా

షూటింగ్‌లో ప్రముఖ సినీన‌టుడు నాని తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. క్రికెట్ నేప‌థ్యంలో నాని హీరోగా జెర్సీ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టుతో శ‌నివారం హైద‌రాబాద్‌లో ఓ స్టేడియంలో షూటింగ్ చేప‌ట్టారు. ఇందులో భాగంగా ర‌నౌట్ నుంచి నాని త‌ప్పించుకునే క్రమంలో క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు కొంచెం దూరం నుంచి జారిప‌డేదాన్ని షూటింగ్ చేప‌ట్టారు.

దుర‌దృష్టవ‌శాత్తు నాని నిజంగానే జారి ప‌డ‌టంతో ముక్కుకు తీవ్రగాయ‌మైంది. వెంట‌నే ఆయ‌న్ను బంజారాహిల్స్లోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ భ‌ర‌త్‌రెడ్డి ఆయ‌న‌కు వైద్యం అందించారు. అయితే షూటింగ్‌లో పాల్గొంటాన‌ని నాని అంటున్నప్పటికీ, ద‌ర్శకుడు, ఇత‌ర చిత్ర యూనిట్ వారిస్తున్నట్టు స‌మాచారం.

అచ్చిరాని జ‌న‌వ‌రి
కాగా నానికి జ‌న‌వ‌రి అచ్చిరాన‌ట్టు ఆయ‌న అభిమానులు వాపోతున్నారు. గ‌తంలో పైసా షూటింగ్ సంద‌ర్భంలో కూడా నానికి యాక్సిడెంట్ అయ్యింది. అలాగే కృష్ణార్జున‌యుద్ధం చిత్రీక‌ర‌ణ సమ‌యంలో కూడా నాని కారును డ్రైవ‌ర్ హైద‌రాబాద్ మెట్రో డివైడ‌ర్‌కు ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో నానికి స్వల్పగాయాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్రస్తుతం మ‌రోసారి జ‌న‌వ‌రిలోనే నాని గాయాలపాలు కావ‌డంతో ఆయ‌న అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *