gouthu sirisha

క‌డ‌పతో గౌతు శిరీష అనుబంధం ఎలాగంటే…

న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి
“నాలో కూడా క‌డ‌ప ర‌క్తం ప్రవ‌హిస్తోంది. నాలో కూడా క‌డ‌ప పౌరుషం ఉంది. ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిజానిజాలు తెల్సుకుని మాట్లాడితే మంచిది” అని శ్రీ‌కాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఇటీవ‌ల ఘాటుగా అన్నారు. ఎక్కడ శ్రీ‌కాకుళం, ఎక్కడ క‌డ‌ప‌… ఇంత‌కూ క‌డ‌ప‌తో శిరీష అనుబంధం ఏంటి? ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలు అంద‌రి మ‌న‌సుల‌ను తొలుస్తున్నాయి. శిరీష‌కు క‌డ‌ప‌తో అనుబంధం ఏంటో తెలియ‌జేసే క‌థ‌న‌మే ఇది.

మ‌లిశెట్టి న‌ర్సరామ‌య్య‌. క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో ఈ పేరు విన‌ని, తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఈయ‌న కోడూరు స‌మితి ప్రెసిడెంట్‌గా విలువైన సేవ‌లు అందించారు. ఈయ‌న మొద‌టి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకి. జ‌న‌తా పార్టీ నేత‌. చిట్వేలి మండ‌లం వెంక‌ట‌రాజుప‌ల్లెకు చెందిన న‌ర్సరామ‌య్య‌, వెంక‌మ్మ దంప‌తుల‌కు ఐదుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. న‌ర్సరామ‌య్య త‌న నివాసాన్ని కోడూరుకు మార్చుకున్నారు. న‌ర్సరామ‌య్య రెండోకుమార్తె విజ‌య‌లక్ష్మి. ప్రముఖ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు గౌతు ల‌చ్చన్న కుమారుడు శివాజీతో ఈమె వివాహం జ‌రిగింది.

ఎలా కుదిరిందంటే…
రాజంపేట ఎంపీ ర‌త్నస‌భాప‌తికి గౌతు ల‌చ్చన్నతో మంచి సంబంధాలుండేవి. 1970వ ద‌శ‌కంలో గౌతు ల‌చ్చన్న త‌న కుమారుడు శివాజీకి పెళ్లి చేయాల‌ని నిశ్చయించుకున్నారు. పెళ్లి ప్రయ‌త్నాల విష‌యం తెలిసిన ర‌త్నస‌భాప‌తి త‌న ప్రాంతంలో మీ (గౌతు ల‌చ్చన్న‌) సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్నత కుటుంబాలున్నాయ‌ని చెబుతూ న‌ర్సరామ‌య్య ఫ్యామిలీ గురించి వివ‌రించారు. ఆ విధంగా పెద్దల మాట‌లు …. శివాజీ, విజ‌య‌ల‌క్ష్మి చూపుల క‌ల‌యిక‌కు దారి తీశాయి. అనంత‌ర కాలంలో శివాజీ ప‌లాస ఎమ్మెల్యే అయ్యారు. వారి ముద్దల బిడ్డే గౌతుశిరీష‌.

శిరీష బాల్యమంతా క‌డ‌ప జిల్లాలోనే…
గౌతుశిరీష బాల్యమంతా క‌డ‌పజిల్లా కోడూరు, వెంక‌ట‌రాజుప‌ల్లెలోనే గ‌డిపార‌ని స‌మాచారం. ఎక్కువ కాలం ఇక్కడే గ‌డుపుతుండ‌టంతో మీకేమీ ఊరు, ఇల్లు, వాకిలి లేదా అని బంధువులు స‌ర‌దాగా శిరీష‌ను ఆట ప‌ట్టించేవార‌ని స‌మాచారం. శిరీష మేన‌మామ మలిశెట్టి ముర‌ళి కోడూరు స‌ర్పంచ్‌గా ప‌నిచేశారు.

జ‌గ‌న్ విమ‌ర్శల‌తో శిరీష‌లో పొడుచుకొచ్చిన క‌డ‌ప పౌరుషం
ప్రజాసంక‌ల్పయాత్రలో భాగంగా ప్రతిప‌క్ష నేత‌, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస‌లో పాద‌యాత్ర నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ సభ‌లో ఇక్కడ ఎమ్మెల్యే ట్యాక్స్ కూడా క‌ట్టాలంటూ గౌతు శివాజీ అల్లుడు, శిరీష భ‌ర్త అయిన‌ చౌదరిపై తీవ్ర విమ‌ర్శలు చేశారు.

జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల‌పై శిరీష ఘాటుగా స్పందిస్తూ త‌న‌లో కూడా క‌డ‌ప పౌరుషం ఉంద‌న్నారు. త‌న‌లో క‌డ‌ప ర‌క్తం ప్రవ‌హిస్తోంద‌ని శిరీష మండిప‌డ్డారు. దీంతో శిరీషకు క‌డ‌ప‌తో అనుబంధం ఏమిటో తెలుసుకోవాల‌నే కుతూహం ప్రతి ఒక్కరిలో క‌లిగింది. శిరీష గురించి ఆరా తీయ‌గా చివ‌ర‌కు ఆమె క‌డ‌ప మ‌న‌వ‌రాల‌ని తేలింది. అదీ శిరీషకు క‌డ‌ప‌తో అనుబంధం సంగ‌తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *