బిగ్‌బాస్-2 షోని ఆపేయండి -హెచ్ఆర్సీకి లాయర్ ఫిర్యాదు

సినిమా

బిగ్‌బాస్-2 షోని ఆపేయాలంటూ హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. షో పేరుతో ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బిగ్‌బాస్-2 షో.. గతకొన్నిరోజులుగా టీవీలో ప్రసారమవుతున్న ఈ రియాల్టీ గేమ్ షో ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ అయి షో ప్రసారం చేసిన ఛానెల్‌ని టాప్ రేంజ్‌లో తీసుకెళ్లగా.. ఇప్పుడు సీజన్ 2 బ్రహ్మాండంగా నడుస్తోంది. అయితే ఈ షో పై ప్రశంసలు ఏ రేంజ్‌లో వస్తున్నాయో.. విమర్శలు కూడా అలానే వస్తున్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తూ.. కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న ఈ షోను వెంటనే ఆపేయాలంటూ హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించారు.

మరోవైపు ప్రజలు కూడా ఈ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో పార్టిసిపెంట్స్ చాలా సందర్భాల్లో హద్దులు మీరుతున్నారని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు అర్థంలేని విమర్శలు, భూతులు మాట్లాడడమేనా షో అంటూ మండిపడుతున్నారు.

ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16మందిని నిర్బంధించి.. వారితో వికృతచేష్టలు చేయిస్తున్నారని, ఇవి సమాజానికి ఎంతమాత్రం ఉపయోగపడవని ఆయన అన్నారు. యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ఈ షోను వెంటనే నిలిపివేయాలని లాయర్ రాపోల్ భాస్కర్ హెచ్చార్సీని కోరారు.
ఫిర్యాదు స్వీకరించిన మానవహక్కుల కమిషన్ ఎలా స్పందిస్తుంది? ఈ షో ప్రసారమయ్యే ఛానెల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? అనేది వేచిచూడాలి.

“24 కిస్సెస్” ట్రైలర్.. కుమారి ముద్దులే ముద్దులు..

డ‌బ్బులు బాగా ఇస్తే ముద్దులు పెట్ట‌డానికి రెడీ అంటూ కాంట్ర‌వ‌ర్సీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ భామ‌. ఇప్పుడు అన్న‌ట్లుగానే “24 కిస్సెస్” లో హీరో ఆదిత్ ను ముద్దుల్లో ముంచేసింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా టైటిల్ లెక్క‌కు త‌గ్గ‌ట్లు 24 ముద్దుల‌తో తేలిపోయింది.

హెబ్బాప‌టేల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒక్క‌సారి కేలెండ‌ర్ 2015లోకి తీసుకెళ్తే అక్క‌డ “కుమారి 21 ఎఫ్” అనే సినిమా ఒక‌టి క‌నిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది హెబ్బా అంటే ఎవ‌రో.. ఆమె సంచ‌ల‌నం ఏంటో..? ఒక్క స‌నిమాతోనే ఇండ‌స్ట్రీని షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ మ‌రీ ఒక్క సినిమాతోనే మాయ‌మైపోతుంద‌ని ఊహించ‌లేదు ఎవ‌రూ. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి విజ‌యాలు ఉన్నా కూడా ఎందుకో కానీ హెబ్బాను ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌ట్టించుకోలేదు.

దాంతో ఇప్పుడు గ‌ట్టుతెగిన గోదారిలా అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేస్తుంది హెబ్బా.

ఇప్పుడు ఈమె న‌టిస్తున్న “24 కిస్సెస్” ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వా త కుమారి ఈజ్ బ్యాక్ అనిపించ‌క మాన‌దు. ఎందుకంటే అమ్మ‌డు చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రెచ్చిపోయింది. ముద్దుల మీద ముద్దులు ఇచ్చేసింది. ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో ముద్దుల‌ను కామ‌న్ గా తీసుకుంటున్నారు ముద్దుగుమ్మ‌లు. ఇందులో హెబ్బా కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *