జగ్గూభాయ్ బయోపిక్‌లో ఆ అంశాలుంటాయా?

గాసిప్స్

జగపతి‌బాబు బయోపిక్‌కి రంగం సిద్ధమైన వేళ.. అందులో ఏయే అంశాలుంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆయన జీవితంలోని లవ్ ట్రాక్స్ చూపిస్తారా? అని ఫిలింనగర్ జనాలు సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్నారు.

ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. అదే సెలబ్రిటీల జీవిత విశేషాలంటే ఇక చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ నిర్మాతలకు కోట్లు గుమ్మరిస్తున్నాయి. సంజూ, మహానటి సినిమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.
ఈ టైంలోనే ఫ్యామిలీ హీరో జగపతిబాబు బయోపిక్‌‌ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. జగపతి‌బాబు ఊరికే స్టార్ హీరో అయిపోలేదు. అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా ఓ పది సినిమాలు ఫ్లాప్స్‌ని ఎదుర్కొన్నాడు. అయితే.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఎప్పుడూ సెలక్ట్ చేసుకున్నారో అప్పటి నుంచి సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు.

ముఖ్యంగా మహిళలు శోభన్‌బాబు తర్వాత అంతగా ఇష్టపడిందంటే జగపతిబాబునే అని చెప్పొచ్చు. ఇలా చేస్తూ సినీ ఇండస్ట్రీలో 30ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు జగ్గూభాయ్.

ఇక.. తన పర్సనల్ లైఫ్‌ని గనుక చూస్తే ఫేమస్ హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్స్, యాంకర్‌తోనూ క్లోజ్‌గా ఉంటారని చాలా వార్తలొచ్చాయి. ఇవన్నీ ఎంతవరకూ నిజమో పక్కనపెడితే.. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు జగ్గూభాయ్ బయోపిక్‌లో టచ్ చేస్తారా? లేదా? అన్నదే పాయింట్.

సాధారణంగా తెలుగు ఆడియెన్స్‌.. తమ ఫేవరేట్ హీరోహీరోయిన్స్‌ గురించి నెగేటివ్‌గా మాట్లాడితే తట్టుకోలేరు. అందుకే బయోపిక్‌లు తీసేటప్పుడు చిత్రయూనిట్స్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించరు. మహానటి విషయంలోనూ ఇదే జరిగింది. సినిమాలో ఎక్కడా నెగెటివ్ అంశాలు లేవు. జెమినీ గణేశన్ కూతుర్లు ఈ విషయంపై మండిపడ్డారు కూడా.. తమ తండ్రిని నెగెటీవ్‌గా చూపించారు తప్పా.. సావిత్రి తప్పులేదా అంటూ ప్రశ్నించారు.

అదే బాలీవుడ్ సంజూ మూవీ విషయంలో అలా కాదు. ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చెప్పి.. చూపించింది మూవీ యూనిట్. ఆ ధైర్యం తెలుగు చిత్ర నిర్మాతలు చేయగలరా? జగ్గూభాయ్‌ బయోపిక్‌లో ఓన్లీ పాజిటీవ్ అంశాలే ఉంటాయా? లవ్ ట్రాక్స్, ఫెయిల్యూర్స్ వంటివి చూపించడం కలేనా? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.
జగపతిబాబు‌ బయోపిక్, వెబ్‌సిరీస్ ఏదైనా కానీ.. అందులో ఏయే అంశాలుంటాయని ఫిలింనగర్‌లో సీరియస్ డిస్కషనే నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *