పిఎంఎంవివైలో సౌత్ ఇండియాలో ఏపి టాప్

న్యూస్

పిఎంఎంవివైలో సౌత్ ఇండియాలో ఏపి టాప్
అత్యుత్తమ జిల్లాగా కర్నూలుకు అవార్డు
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన(పిఎంఎంవివై) పథకం అమల్లో భారతదేశంలో దక్షిణ ప్రాంతం(సౌత్ జోన్) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యుత్తమంగా ఎంపికైంది. లక్ష్యాన్ని చేరుకోవడమే గాకుండా అత్యుత్తమ ఫలితాల సాధనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఏపి వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సాధించింది. పిఎంఎంవివై పథకం లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు ఈ గుర్తింపు లభించింది. లక్ష్యాల సాధనే కాకుండా అత్యుత్తమ ఫలితాల జిల్లాగా కర్నూలుకు మరో కేటగిరిలో అవార్డు లభించింది.కేంద్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.
పిఎంఎంవివై కింద అత్యధిక సంఖ్యలో తల్లులకు కర్నూలులో లబ్ది కలిగింది.కర్నూలు జిల్లా స్ఫూర్తిగా మిగిలిన జిల్లాలు కూడా ఈ పథకం ప్రయోజనాలను మాతృమూర్తులకు అందించడంలో పోటిబడాలని ఆ లేఖలో పేర్కొన్నారు.సెప్టెంబర్ 7న డెహ్రాడూన్ లో జరగనున్న ముగింపు వేడుకల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు ఏపి హెల్త్ మెడికల్ అండ్ ఫామిలీ వెల్పేర్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *