శిశు విక్ర‌యాలు చేస్తున్న‌ పాన్-ఇండియా రాకెట్ స‌భ్యులు అరెస్టు

న్యూస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కొన్ని రోజుల వ‌య‌సున్న పిసి పిల్ల‌ల్ని విక్ర‌యిస్తున్న ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌త జెల‌లోనే ఈ శిశు విక్ర‌యాల రాకెట్ పై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, కొరియర్లను బట్వాడా చేస్తున్న వారిలో కొందరని అరెస్టు చేశామ‌ని ఈ శిశువిక్ర‌యాల్లో ఒక మ‌హిళ కీల‌కంగా ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. గత నెల ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ నోటీసుకు రాకెట్టు వచ్చిన‌ప్ప‌టి నుంచి దీనిపై ర‌హ‌స్య విచార‌ణ చేస్తున్నారు. అయితే ఈ రాకెట్‌లోని వ్య‌క్తి ఒక‌ర ఇటీవ‌ల హ‌త్య‌కు గురయ్యాడ‌ని అందుకు ఈ విక్ర‌యాల్లో వ‌చ్చిన విభేదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంద‌ని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అరెస్ట‌యిన వారిని నుంచి ఒక నవజాత శిశువు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈముఠా బారి నుంచి ఇప్ప‌టి దాకా న‌లుగురు శివువుల‌ను ర‌క్షించారు. వీరిని కిడ్నాప్ చేసి విక్ర‌యిస్తున్నారా? లేక మ‌రో విధంగా పిల్ల‌ల్ని తీసుకున్నారా అన్న‌దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ రాకెట్‌లో దొరికిన పిల్లులు గ‌తంలో వివిధ ప్రాంతాల్లో క‌నిపించ‌కుండా పోయిన పిల్ల‌లు ఒక‌టేనా అన్న కోణంలో కూడా విచార‌ణ చేస్తున్నారు. లేదా ఆసుపత్రుల నుంచి కొంత మంది సిబ్బంది ద్వారా ఎత్తుకొచ్చారా అన్నది ద‌ర్యాప్తులో తేల‌నుంద‌ని పోలీసులు చెబుత‌న్నారు. ఈ శిశువిక్ర‌యాల వ్య‌వ‌హారంలో ఢిల్లీలోని ఐ విఎఫ్ ఆసుప‌త్రితో పాటు, మరికొన్ని ఆసుపత్రుల‌తో లింకుల‌పై అరా తీస్తున్నారు. పాన్-ఇండియా రాకెట్‌గా పిలిచే ఈ రాకెట్ వెనుక వున్న అస‌లు నేర‌స్తుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *