నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587అడుగులకు చేరుకుంది.

న్యూస్

జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం సగానికిపైగా తగ్గింది. 4 రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా వచ్చి చేరగా, సోమవారం ఇన్‌ఫ్లో 51,922 క్యూసెక్కులుగా నమోదైంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 587.10 అడుగుల వద్ద 305.62 టీఎంసీల నిల్వ ఉంది. వరుస సెలవుల నేపథ్యంలో సాగర్‌ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. హిల్‌కాలనీ డౌన్‌పార్క్‌ లాంచిస్టేషన్‌ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు 3 ట్రిప్పులు లాంచీలు నడపడంతో రూ.1.15లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల జలాశయానికి కూడా వరద తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 883.30అడుగులుగా, నీటినిల్వలు 206.0996టీఎంసీలుగా నమోదయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *