సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణి చేసిన స్పీకర్ కోడెల

న్యూస్
సత్తెనపల్లి :  రాష్ట్రంలో చంద్రన్నభీమా, సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నులకు అమృత హస్తంగా మారిందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం సత్తెనపల్లి స్పీకర్ కార్యాలయంలో నియోజకవర్గంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు 4, 86,900 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను,  మూడు లబ్ధిదారులకు చంద్రన్నభీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్ వైద్యసేవలో లేని వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే కుటుంబంలో ఎవరైనా చనిపోతే చంద్రన్నభీమా ద్వారా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కనీస అవసరాలైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *