వారి ఐక్య‌త కంటితుడుపు చ‌ర్యే- నిర్మాలా సీతారామ‌న్‌

న్యూస్ పొలిటికల్

న్యూఢిల్లీ :  ప్రతిపక్షాల ఐక్యత కేవలం కంటి తుడుపు చర్య వంటిదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం అన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల కోసం మహా కూటమి పేరుతో ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొట్టిపారేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత రక్షణ మంత్రి, బీజేపీ నేత నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ఆ సమావేశంలో చెప్పిన మాటలను వివరించారు.

2014 లోక్‌‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలను బీజేపీ ఓడించిందని, అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలు మహా కూటమిగా ఏర్పడినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపబోవని, బీజేపీకి ఎటువంటి నష్టం వాటిల్లదని అమిత్ షా చెప్పినట్లు నిర్మల తెలిపారు.

19 రాష్ట్రాల్లో, 75 శాతం దేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, దీనితో సంతృప్తి చెందకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *