నీ బుద్ధి అప్పుడేమైంది నాని

సినిమా
అబ్బో కౌశ‌ల్ భార్య గురించి ప్ర‌స్తావించ‌గానే నానికి కోపం క‌ట్ట‌లు తెంచుకొంది. మ‌రి ఇదే ఆగ్ర‌హం, వివేకం బాబు గోగినేని భార్య గురించి కౌశ‌ల్ ప్ర‌స్తావించిన‌ప్పుడు నానిలో ఎందుకు కొర‌వ‌డ్డాయ‌నేది ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడైనా, ఏదైనా జ‌రగొచ్చు అని బిగ్‌బాస్‌తో పాటు హోస్ట్ నాని ప‌దేప‌దే చెబుతుంటారు. నిజ‌మే…జ‌ర‌గ‌కూడ‌ని వింత‌లు, విశేషాలు బిగ్‌బాస్ హౌస్‌లో చోటు చేసుకున్నాయి. మున్ముందు మ‌రెన్ని చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటాయో అనే ఆస‌క్తి, ఉత్కంఠ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఉంది.
ప్చ్‌..దీప్తి హౌస్ వెలుప‌ల ఉన్న వారి గురించి ప్ర‌స్తావించ‌డం ఏం ప‌ద్ధ‌తిగా లేద‌ని నాని మంద‌లింపు. అస‌లే సినీ న‌టుల‌కు మించి న‌ట‌నా కౌశ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న దీప్తి …ఏంటి నాని గారు. నాకేమీ అర్థం కాలేదు. నేను ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా మాట్లాద‌లేదే అని అమాయ‌క ప్ర‌శ్న‌లు. మీరు కౌశ‌ల్ భార్య గురించి ప్ర‌స్తావించ‌లేదా? ఆమె కౌశ‌ల్‌ను భ‌రిస్తున్నందుకు దండం పెట్టాల‌ని అన‌లేదా అని నాని భ‌లే ప్ర‌శ్నించారు లేండి.  వెర‌సి బిగ్‌బాస్ హౌస్ షోను కాస్త ర‌క్తి క‌ట్టించారు.
మ‌రి వాడ‌కూడ‌ని భాష‌ను, సంబంధంలేని వ్య‌క్తుల గురించి సంభాష‌ణ‌ను ప్రేక్ష‌కుల‌కు ఎలా చూపారు?  మొత్తం ఇర‌వై నాలుగు గంట‌ల షోలో ఏం లేవ‌ని కౌశ‌ల్ భార్య గురించి దీప్తి అన్న మాట‌ల‌నే ప్రేక్ష‌కుల‌కు చూపారు. బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల సంస్కారం ఏమైంది. కౌశ‌ల్‌తో పాటు ఆయ‌న భార్య గౌర‌వాన్ని కాపాడే బాధ్య‌త బిగ్‌బాస్‌కు లేదా?
కౌశ‌ల్ భార్య గురించి మాట్లాడితే నాని తీవ్రంగా స్పందించ‌డం అభినంద‌నీయ‌మే. ఇదే కౌశ‌ల్ ఒక సంద‌ర్భంలొ బాబు గోగినేని భార్య విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ప్పుడు నానిలో ఎందుకు స్పంద‌న క‌రువైంది. అప్పుడే కౌశ‌ల్‌ను మంద‌లించి ఉంటే ఇప్పుడు దీప్తి అలా మాట్లాడేవారు కాదు క‌దా?
బాబు గోనినేని అన్న‌ట్టు కౌశ‌ల్‌కు ఏకైక అభిమాని నాని ఒక్క‌రే. అందుకేనేమో కౌశ‌ల్‌కు సంబంధించి ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా నాని ర‌క్ష‌ణ క‌వ‌చంగా మారారు. ప్చ్‌…అస‌లే బిగ్‌బాస్ షో. ఎవ‌రైనా, ఏమైనా షో ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *